BigTV English

Amardeep : నా కళ్ల ముందే ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు.. అమర్ ఎమోషనల్

Amardeep : నా కళ్ల ముందే ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు.. అమర్ ఎమోషనల్

Amardeep: బుల్లితెర నటులలో అమర్ దీప్ అంటే తెలియని వారు వుండరు. సీరియల్ ద్వారా తెలుగు ఆడియోన్స్ కు దగ్గర అయ్యారు.. బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ తరువాత అమర్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఎన్నో షోలలో కనిపించి ఆడియన్స్ ని అలరిస్తున్నారు. తాజాగా మాటీవీలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్2 ప్రోగ్రాంలో అమర్ తన ప్రేమ గాధను తెలిపి ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు చూద్దాం..


నా కళ్ల ముందే ఆమెను వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు..

అమర్ కేరళలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా, అది వద్దనుకొని సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చేశారు. అలా తన జాబును పక్కనపెట్టి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లోనటిస్తూ అభిమానులకు దగ్గరయ్యాడు. తాజాగా మాటీవీలో కిర్రాక్ బాయ్స్ కిలాడి గేమ్స్ 2 లో అమర్ దీప్ తన ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో లవ్ థీమ్ కాన్సెప్ట్ తో వచ్చిన కంటెస్టెంట్స్ అందరు వారి మొదటి ప్రేమ గురించి చెప్పాలి. అందులో భాగంగా అమర్ దీప్ మాట్లాడుతూ.. దగ్గరుండి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి బస్సు ఎక్కించి పంపించిన అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మన కళ్ళ ముందు జరిగితే మనం చూస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడు బస్సులో వచ్చే అమ్మాయి వస్తుందని ఎదురు చూస్తున్న టైం లో వేరే అబ్బాయి వచ్చి వెనుక నుంచి హగ్ చేసుకుంటే అది మనకల్లారా చూస్తే ఎలా ఉంటుంది. నా కళ్ళ ముందే నేను అది చూశాను అంటూ ఎమోషనల్ అవుతాడు అమర్ దీప్. ఈ వీడియో చూసిన వారంతా నీ లైఫ్ లోకి బెస్ట్ గిఫ్ట్ గా దేవుడు తేజుని పంపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


రియల్ లైఫ్ ..క్యూట్ పెయిర్ ..

బుల్లితెరపై కనిపించే రియల్ లైఫ్ జంటల్లో అమర్దీప్ తేజస్విని క్యూట్ పెయిర్. సీరియల్ ద్వారా మొదలైన వీరి పరిచయం తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ జీవిస్తున్నారు. అమర్ తేజస్విని కన్నా ముందు వేరే అమ్మాయిని ప్రేమించినట్లు, ఆ అమ్మాయి తనని మోసం చేసినట్లు, ఇప్పటికే ఎన్నో షోలలో తన గతం గురించి అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్2 లో మరోసారి తన బాధను తెలిపాడు. ఈ షో శని, ఆదివారాలలో మాటీవీలో రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.

ప్రోమో ఇలా సాగింది ..

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ 2 లో బాయ్స్ వైపు శేఖర్ మాస్టర్ గర్ల్స్ టీంకు సపోర్ట్ గా.. అనసూయ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. బాయ్స్ లో నిఖిల్, మానస్, బం చిక్ బబ్లు, పృద్వి, ఇమ్మానుయేల్, దీపక్, సాకేత్ వంటి వారు కిరాక్ బాయ్స్ గా పాల్గొన్నారు. గర్ల్స్ టీం లో హమీద, రోషిణి, తేజస్విని, సుస్మిత, లాస్య, శ్రీ సత్య, ఐశ్వర్య, కిరాక్ గర్ల్స్ గా పాల్గొన్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో, యాంకర్ శ్రీముఖి మొదటి లవ్ గురించి చెప్పమని శ్రీ సత్య అని అడుగుతుంది. ఆమె మాట్లాడుతూ.. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు రోజు తనని చూడడానికి వెళ్లే దాన్ని, తనే నా మొదటి హార్ట్ బ్రేక్ ఎందుకంటే అతనికి మా అక్క నచ్చింది అంటూ తెలిపింది. ఆ తరువాత ప్రియాంక, శివకుమార్ ఇద్దరు స్టేజ్ పైకి వస్తారు. మనం ఇద్దరం ఇప్పటిదాకా చాలా విషయంలో కాంప్రమైజ్ అవుతూ వచ్చాము. నేనింకా కాంప్రమైజ్ చేయకుండా, నువ్వు ఏది అడిగితే ఈ ప్రపంచంలో దాన్ని నీకు తీసుకొచ్చి ఇస్తాను అని శివకుమార్ ప్రియాంక జైన్ కు ప్రామిస్ చేస్తాడు. ఈ ప్రోమో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×