IPL Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ పరిస్థితి నెలకొంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కారణంగా… వారం కిందట ఐపిఎల్ 2025 నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో చాలామంది విదేశీ ప్లేయర్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో మళ్లీ… ఇండియాకు రావాలని అన్ని జట్లకు ఆదేశాలు వెళ్లాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ 17వ తేదీ నుంచి పునః ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో…. 10 జట్లు కూడా మళ్లీ ప్లేయర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొంతమంది విదేశీ ప్లేయర్లు తిరిగి ఇండియాకు వస్తుంటే మరి కొంత మంది రావడం లేదు.
ALSO READ: MI’s 4th IPL Title: కాలుకు 7 కుట్లు..రక్తం కారుతోంది..అయినా ముంబైపై వాట్సన్ వీరోచిత బ్యాటింగ్
ఐపీఎల్ లో కొత్త రూల్స్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త నిర్ణయం తీసుకుంది. రీప్లేస్మెంట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో పాల్గొనే 10 జట్లలో చాలామంది ప్లేయర్లకు గాయాలయ్యాయి. అలాగే టోర్నమెంట్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో విదేశాలకు వెళ్లిపోయి అక్కడే చిక్కుకున్నారు. కొంతమంది వస్తున్నారు మరికొంతమంది రావడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో చాలా జట్లలో చాలామంది ప్లేయర్లు మిస్ అవుతున్నారు. రకరకాల కారణాలవల్ల ప్లేయర్లు రాకపోవడంతో వాళ్ళ స్థానంలో మరో కొత్త ప్లేయర్లను తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఆ రీ – రిప్లేస్మెంట్లకు ఈసారి అవకాశం ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. తమ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే కొత్త ప్లేయర్లను ఇప్పుడు తీసుకోవచ్చు. అయితే ఈ రూల్ పెట్టడమే కాకుండా ఓ కండిషన్ కూడా అమలు చేస్తున్నారు.
2025 ఐపీఎల్ అయిపోయే వరకు మాత్రమే ఈ రూల్ ఉంటుందని… వెల్లడించారు. ఐపీఎల్ 2026 సీజన్ లో మాత్రం ఈ రీ రీప్లేస్మెంట్ కింద తీసుకున్న ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి వీలు లేదు. ఆ ప్లేయర్ లందరూ కచ్చితంగా ఐపీఎల్ 2026 సమయంలో జరిగే మినీ వేలంలో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ జట్టు కొనుగోలు చేస్తే అందులోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్ లో మాత్రం రీ రీప్లేస్మెంట్ కు మాత్రం అవకాశం ఉంది.
ALSO READ: Virat Kohli – Rohit Sharma: నక్క తోక తొక్కిన రోహిత్, కోహ్లీ.. కోట్ల వర్షం కురిపించిన BCCI
ఐపీఎల్ ఎప్పటి నుంచి ప్రారంభమంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ఈ నెల 17వ తేదీ నుంచి పునః ప్రారంభం అవుతుంది. జూన్ మూడో తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా …. జూన్ మూడవ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
🚨 IPL TWEAK RULES TEMPORARILY. 🚨
– Temporary replacements cannot be retained for the next season.
– Replacements approved prior to the suspension will remain eligible for retention. (Cricbuzz). pic.twitter.com/4kJbdChkNG
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2025