Hari Hara VeeraMallu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు పైన ఆసక్తిని తగ్గించి రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఒక పండగ వాతావరణం నెలకొనేది. టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా అనిపించేది. ఈ రోజుల్లో ఒక సినిమా టికెట్ దొరకడం చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో కూర్చుని టికెట్ బుక్ చేసుకుని థియేటర్లో తీరిగ్గా సినిమా కూర్చుని సినిమా విసిగిస్తే ఫోన్లో పడిపోతారు ఇప్పుడున్న చాలామంది ఆడియన్స్. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎలా అయితే సినిమాలు చేశాడో రీయంట్రి తర్వాత అలానే చేస్తున్నాడు అనిపించేలా ప్రాజెక్టులు సైన్ చేశాడు.
త్రివిక్రమ్ వలనే జరిగాయి
అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లో కంప్లీట్ గా బిజీ అయిపోయి సినిమాలు మానేస్తానని పవన్ కళ్యాణ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కి కేవలం సినిమాలు మాత్రమే ఇన్కమ్ సోర్సెస్ కాబట్టి త్రివిక్రమ్ మాటలు వల్ల మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
కానీ అప్పటికే ఉన్న టికెట్ రేట్ ల వలన ఈ సినిమా కమర్షియల్ గా లాభం తీసుకురాలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది గాని కొంతమంది డిస్ట్రిబ్యూటర్ కి నష్టం వాటిల్లింది. బ్రో సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. ఈ మూడు సినిమాలకి త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనే షూటింగ్ జరిగి రిలీజ్ అయ్యాయి.
పాపం హరిహర వీరమల్లు
వీటన్నిటికంటే ముందు హరిహర వీరమల్లు సినిమా వస్తుంది అని అందరూ ఊహించారు. క్రిష్ జాగర్లమూడి మొదటిసారి పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే అందరికీ నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఉండేది. ఈ వీడియో నుంచి రిలీజ్ అయిన మొదటి వీడియో కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను పలుసార్లు మార్చారు. ఈ ప్రాజెక్టు కదలట్లేదు అనుకునే టైంకి, పవన్ కళ్యాణ్ చేతిలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కదలడానికి రీజన్ అమెజాన్ వాళ్లే. మే 30న రిలీజ్ అవ్వకపోతే… ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఒప్పించి… నిన్నటితో షూటింగ్ పూర్తి చేశారు. ఒకవేళ అమెజాన్ వాళ్ళు ఒప్పుకుంటే జూన్ రెండవ వారంలో హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఒప్పుకోకపోతే 30న వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ప్రమోషన్స్ కి టైం సరిపోదని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయినట్లయితే విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ వాయిదా కావలసి వస్తుంది.