Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఉన్న క్రేజే వేరు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటించిన ‘దో ఔర్ దో పాంచ్’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ సినిమా విడుదలై బుధవారంతో 43 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా అమితాబ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఓ ఫన్నీ ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకున్నారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ మూవీ షూటింగ్ సమయంలో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘దో ఔర్ దో పాంచ్ సినిమా రిలీజ్ అయి 43 ఏళ్లు పూర్తైంది. ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా సాగింది. ఆ రోజుల్లో బెల్ బాటమ్స్ చాలా ఆహ్లోదకరంగా ఉండేవి. ఈ సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు నా ప్యాంటులోకి ఎలుక దూరింది. బెల్ బాటమ్‌కు థ్యాంక్యూ’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌కు భిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.