Amitabh Bachchan: ‘పుష్ప -2’ సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun)రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా రూ.500 కోట్లు రాబట్టాలి అంటే సినిమా ఫుల్ రన్ ముగిసే వరకు ఎదురు చూడాల్సిందే. అలాంటిది అల్లు అర్జున్ కేవలం మూడు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి తన స్టామినా నిరూపించారు. ఇక దీంతో దేశవ్యాప్తంగా అటు అభిమానుల నుంచి ఇటు సినీ ప్రేమికుల నుంచే కాకుండా సినీ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు వెళ్ళుతున్నాయి. ఇక ఇలాంటి సమయంలో బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న నార్త్ కా షేర్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan )అల్లు అర్జున్ కి థాంక్స్ చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప -2 ప్రమోషన్స్ లో బిగ్ బి పై ప్రశంసలు..
అంతేకాదు ఇంత సడన్ గా ఆయన ఎందుకు థాంక్స్ చెప్పారు అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా..” హిందీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు?” అని అల్లు అర్జున్ ని ప్రశ్నించింది బాలీవుడ్ మీడియా.. ఇక అల్లు అర్జున్ ఏ మాత్రం తడబడకుండా అమితాబ్ బచ్చన్ అని చెప్పడంతో పాటు ఆయన నటనా ప్రస్థానం తనను ఇన్స్పైర్ చేసిందని తెలిపారు. “చిన్నప్పటినుంచి నేను అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కెరియర్ గ్రాఫ్ కూడా ఎంతో మందికి ఆదర్శం. ఈ వయసులో కూడా ఆయన అంత అందంగా నటించడం అంటే ఆయనకే సాధ్యం. ఒకవేళ నేను కూడా ఆయన వయసుకు వస్తే అలాగే నటించాలని కోరుకుంటున్నాను. నాలాంటి ఎంతోమందికి ఆయన ఇన్స్పైర్ గా నిలిచారు అంటూ అమితాబ్ బచ్చన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేశారు అల్లు అర్జున్. అయితే అప్పుడెప్పుడో అల్లు అర్జున్ చేసిన కామెంట్లు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వరకు చేరాయేమో తెలియదు కానీ ఈ సందర్భంగా ఆయన రియాక్ట్ అవుతూ బన్నీకి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు.
బన్నీకి థాంక్స్ చెప్పినా అమితాబ్ బచ్చన్..
అమితాబ్ బచ్చన్ తన అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా.. “అల్లు అర్జున్ గారు నేను మీ మాటలకు ఒప్పింగిపోతున్నాను. మీరు నాకు అర్హత కంటే ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారు. మేము మీ పని అలాగే ప్రతిభకు పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉండండి. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు ఎన్నో చూడాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను. బంగారు భవిష్యత్తుకు ఆల్ ద బెస్ట్ మీరు ఇలాంటి సక్సెస్ లు ఎన్నో అందుకోవాలి” అంటూ తన ఎక్స్ ద్వారా తెలిపారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
సక్సెస్ ఉంటే క్రేజ్ వస్తుంది..
వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి హీరోలు ఎంతోమంది అమితాబ్ బచ్చన్ ను పొగుడుతూ ఉంటారు. వారే తమ ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. కానీ ఇలా అల్లు అర్జున్ కి రెస్పాండ్ అవ్వడమే కాకుండా సక్సెస్ కి పునాదులు వేయాలని కోరుతున్నామని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనా పుష్ప -2 సినిమా ఇచ్చిన సక్సెస్ ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ కూడా రెస్పాండ్ అయ్యేలా చేసిందని, అందుకే సక్సెస్ లో ఉంటే ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటుందో ఇదే నిదర్శనం అంటూ కూడా పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
#AlluArjun ji .. so humbled by your gracious words .. you give me more than I deserve .. we are all such huge fans of your work and talent .. may you continue to inspire us all .. my prayers and wishes for your continued success ! https://t.co/ZFhgfS6keL
— Amitabh Bachchan (@SrBachchan) December 9, 2024