BigTV English

Bigg Boss Gangavva : నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టించలేదా..? ఇన్నాళ్ళకు బయటకు నిజం..

Bigg Boss Gangavva : నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టించలేదా..? ఇన్నాళ్ళకు బయటకు నిజం..

Bigg Boss Gangavva : వరల్డ్ టాప్ రియాలిటీ బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో ఈ బిగ్ బాస్.. తెలుగులో ప్రస్తుతం 8వ సీజన్ జరుగుతుంది. ఈ వారంతో ఈ సీజన్ పూర్తవుతుంది. 14వ వారం ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు విష్ణు ప్రియ రోహిణి ఎలిమినేట్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ లో ఐదు మంది మాత్రమే ఉన్నారు. నిన్న సండే సండే రోజున హౌస్ లో విన్నర్ అయిన వారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుందో చెప్పారు. కంటెస్టెంట్స్ అంతా ఆటలు ఆడి ఆ జీరోకు అన్‌లిమిటెడ్ అమౌంట్‌ను యాడ్ చేయవచ్చని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పటికీ కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ప్రైజ్ మనీని రూ.54,30,000కు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రైజ్ మనీ ని ఎవరు ఎలా వాడతారో చెప్పాలని నాగార్జున కోరుతాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెప్తారు. అందులో విష్ణు ప్రియ గౌతమ్ మాత్రం గంగవ్వ కు ఆర్థిక సాయం చేస్తానని చెప్తారు. గత ఎపిసోడ్ కి వచ్చిన గంగవ్వకు నాగార్జున ఇల్లు కట్టించిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు గౌతమ్ విష్ణు ప్రియ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అదేంటి నాగార్జున కట్టించాడు కదా మళ్లీ కొత్తగా వీళ్ళు అనడం ఏంటి అని సందేహం బిగ్ బాస్ ఆడియన్స్ వస్తుంది.. మరి ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలుసుకుందాం..


గంగవ్వకు ఇల్లు కట్టించడం నిజం కాదా..? 

బిగ్ బాస్ సీజన్ ఫోర్ కు కంటెస్టెంట్ గా వచ్చింది యూట్యూబర్ గంగవ్వ.. అప్పుడు షోలో ఉన్నప్పుడు నాగార్జున ఆమెకు సొంత ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తానని మాట ఇచ్చాడు. బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాగార్జున ఇచ్చిన సాయంతో ఇల్లు కట్టుకున్నానని గంగవ్వ అనేక వీడియోలను చేసి యూట్యూబ్లో పెట్టింది. ఇక రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 8లోకి వచ్చిన గంగవ్వ ఆ విషయాన్ని బయట పెట్టింది. సొంత ఇంటి నిర్మాణం కోసం రూ. 20 లక్షల వరకు నాగార్జున, బిగ్ బాస్ మేకర్స్ సహాయం చేసినట్లు ఆమె వెల్లడించారు. నాగార్జున గ్రేట్ అంటూ అప్పటిలో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు అందులో నిజం లేదని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.


విష్ణు ప్రియా, గౌతమ్ లు గంగవ్వకు ఆర్థికసాయం..? 

బిగ్ బాస్ సీజన్ 8 లో నిన్న సండే ఎపిసోడ్ లో నాగార్జున ప్రైజ్ మనీని రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీని ఎవరు ఎలా వాడుతారు చెప్పాలని నాగార్జున అడుగుతాడు.. ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగా వాడతామని చెప్తారు. కానీ విష్ణు ప్రియ మాత్రం అందరికీ నచ్చేలా చెప్పింది. తనకొచ్చిన ప్రైస్ మనీ లో గంగవ్వకు ఇల్లు కట్టుకోవడానికి కాస్త సాయం చేస్తానని చెప్పింది. అలాగే గౌతమ్ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో గంగవ్వ కి సాయం చేస్తానని చెప్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.కామెంట్లు చేస్తున్నారు.. అదేంటి ఆల్రెడీ గత సీజన్లో గంగవ్వ వచ్చినందుకు నాగార్జున ఇల్లు కట్టించాడు కదా మళ్ళీ ఇప్పుడు ఇంటికి సాయం చేస్తున్నాం అంటున్నారు అందులో నిజం లేదా? నాగార్జున కేవలం మాటల వరకే పరిమితం అయ్యారా అని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు? అసలు నాగార్జున సాయం చేశారా లేక కంటెస్టెంట్లు సాయం చేస్తే నాగార్జున చేసినట్టు కవరింగ్ ఇచ్చారా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ వార్తలపై గంగవ్వ లేదా నాగార్జున స్పందిస్తే గాని అసలు విషయం ఏంటో తెలియదు..

Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×