Amitabh bachchan : సాధారణంగా మనం చేతికి ఎన్ని గడియారాలు పెట్టుకుంటాం.. ఇదెక్కడి తిక్క ప్రశ్న మనిషనేవాడు ఎవ్వరైనా ఒకటే ధరిస్తాడు కదా అని అనుకుంటున్నారు కదా.. కానీ కాదు ఓ బిగ్ ఫిలిం స్టార్ చేతికి రెండు గడియారాలు పెట్టుకుంటాడు అవసరమైతే మూడు పెట్టుకుంటాడు. ఇంతకు ఎవరా ఫిలిం స్టార్ అని అనుకుంటున్నారు కదా ఇంకెవ్వరు మన బాలీవుడ్ బిగ్ బీ అమితబ్ బచ్చన్(Amitabh bachchan). అమితాబ్ బచ్చన్ ఇటీవల రెండు గడియారాలు ధరించి కనిపించాడు.
ఇది కేవలం సినిమాకోసమే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన అలవాటని బాలీవుడ్ స్టార్స్ చెబుతుంటారు. అమితాబ్ తన మణికట్టు మీద రెండు గడియారాలు ఎందుకు ధరిస్తారనే విషయాన్ని ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “రెండు గడియారాలు ధరించే ట్రెండ్ మా అమ్మ జయా బచ్చన్ ప్రారంభించింది. నేను చిన్నవాడిగా యూరప్‌లో బోర్డింగ్ స్కూల్‌లో ఉన్నప్పుడు, రెండు ప్రదేశాల సమయాన్ని తెలుసుకోవడానికి ఆమె రెండు గడియారాలు ధరిస్తుండేది.
తర్వాత నాన్న కూడా ఈ అలవాటును స్వీకరించారు. వారు యూరప్ సమయానికి అనుగుణంగా నాతో మాట్లాడేందుకు దీన్ని ఉపయోగించేవారు.” అని అభిషేక్ అన్నారు. ఈ విషయంపై అమితాబ్ బచ్చన్ కూడా స్పందిస్తూ, “నేను నా సాధారణ జీవితంలో రెండు, కొన్నిసార్లు మూడు గడియారాలు కూడా ధరించేవాడిని. సరదాగా అలాంటి పనులు చేసేవాడిని. ఇప్పుడు ఈ అలవాటు నా కొత్త సినిమాలో ఒక ప్రత్యేకమైన శైలిగా మారింది,” అని చెప్పారు. అమితాబ్ బచ్చన్‌కు ఫ్యాషన్, స్టైల్ విషయంలో కొత్తదనం కనుక్కోవడంలో మంచి ఆసక్తి ఉంటుంది.
అందుకే, రెండు గడియారాల స్టైల్ ఇప్పుడు సినిమా ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా, ఒక భావోద్వేగానికి, కుటుంబ అనుబంధానికి నిదర్శనం. కాగా, అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఆయన సిల్ వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్నారు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ లు చేసిన గ్యాప్ తీసుకుని వాటిని ఫినిష్ చేశారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో ఏదైనా సినిమా ఫంక్షన్ లో కనిపిస్తే ఆయన చేతికి పెట్టుకున్న రెండు వాచీలే హాట్ టాపిగ్ గా మారుతున్నాయి.