BigTV English

Osho : ఈయనో శృంగారం గురువు.. ఆశ్రమంలో జరిగే విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Osho : ఈయనో శృంగారం గురువు.. ఆశ్రమంలో జరిగే విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Osho : ఇండియాలోని చాలా మంది యువతకు రాజనీష్ అంటే గుర్తుపట్టడం కష్టమేమో కానీ, ఓషో గురించి తెలుసా అంటే కొందరైనా స్పందించారు. మానసిక ప్రశాంతత, యోగా సహా అనేక విషయాలపై తన ఆలోచనలను పంచుకునే ఈ ఆధ్యత్మిక గురువుకు.. మిగతా వాళ్లకు భిన్నంగా సె*క్స్ గురూ.. అని యువతలో గుర్తింపు సాధించారు.


విజ్ఞానానికి మార్గాన్ని అన్వేషించడమే పరమావధి అని భావించే భారత్ లో ఎన్నో తత్వాలు, మరిన్నో దైవారాధనలు.. ప్రతీదాని అంతిమ గమ్యం జ్ఞానాన్ని సంపాదించడమే. అందుకే మిగతా సంస్కృతులకు, మతాలకు భిన్నంగా భారతీయత విభిన్నత్వాన్ని అనుసరిస్తుంది. అందులో భాగంగానే ఓషో సైతం తనదైన ఆధ్యాత్మిక మార్గాన్ని, జ్ఞానాన్ని చేరుకునే విధానాన్ని భిన్నంగా అనుసరించారు. అందుకే.. నేటికీ ఇండియాలోని యువత ఓష్ పుస్తకాల కోసం బుక్ స్టాళ్లకు వెలుతుంటారు. అతని వీడియో, ఆడియో కోసం సోషల్ మీడియాలో వెతుకుతుంటారు. ఆయన చెప్పే విషయాల్ని వినేందుకు, అనుసరించేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఆయన తన పేరును ఓషో గానే చెప్పుకునేందుకు ఇష్టపడ్డారు. ఓషో అంటే తనను తాను సముద్రంలో కలుపుకున్న వాడు అని అర్థం. అయితే.. ఆయనను అనుసరించే లక్షలాధి మంది అభిమానులకు ‘ఆచార్య రజనీష్’, ‘భగవాన్ శ్రీ రజనీష్’గా అంతర్జాతీయంగా గుర్తింపు సాధించారు. 1931 డిసెంబరు 11న మధ్యప్రదేశ్‌లో జన్మించారు ఇతని అసలు పేరు చంద్రమోహన్ జైన్.


ఓషో గూర్చి ప్రత్యేకత

ప్రతీ గురువులా కాకుండా ఓషో సంప్రదాయ ఆచారాలను తిరస్కరించారు. సంప్రదాయాలు, తాత్మిక చింతన, మతమనే భావనలో ఆయన చిక్కుకోలేదు. ఆయన జీవితం ఎల్లప్పుడూ అదుపు తప్పని స్థాయిలో పూర్తిగా ఆనందంగా ఉండాలని భావించేవారు. మిగతా ఆధ్యాత్మిక గురువులకు భిన్నంగా.. ఆయన శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడేవారు. అందులోని విషయాల్ని వివరిస్తూ.. సంభోగ్ సే సమాధి అనే పుస్తకాన్ని సైతం రాశారు. దీనిపై భారతీయ ఆధ్యాత్మిక వేత్తల్లో అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి రచనల కారణంగానే.. ఆయనను సె*క్స్ గురువు అనే పేరుతో పిలుస్తున్నారు.

ఓషో ప్రాథమిక జీవితం

రాజనీష్ 11 సంతానాలలో అతి పెద్దవాడైన ఆయన పుట్టింది బాబులాల్, ఒక బట్టల వ్యాపారి, మరియు సరస్వతి జైన్ దంపతుల నుంచి. 8 సంవత్సరాలు పూర్తి అయ్యేవరకు ఆయన తన మామవారితో జీవించాడు, ఇక్కడ ఆయనకు అపార స్వేచ్ఛను అందించారు. ఈ అనుభవం ఆయనపై గొప్ప ప్రభావాన్ని చూపించింది.

ఓషో విద్యాభ్యాసం

1951లో బీఏ పూర్తయిన తర్వాత ఓషో హితకారిణి కాలేజీలో ప్రవేశం లభించింది. తరగతి గదుల్లో నిత్యం ప్రశ్నలు సంధిస్తూ.. తరగతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని అతనిపై ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఈ కారణంగా.. ఓ ప్రొఫెసర్, ఓష్ మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో.. ఓషో ను కాలేజీ నుంచి పంపించేశారు. ఆ తర్వాత అతన జాయిన్ అయిన చాలా కాలేజీల నుంచి బహిష్కరణకు గురైన ఓషో.. చివరికి డీఎన్ జైన్ కాలేజీలో ప్రవేశం లభించింది. రజనీష్ ఆ తరువాత ఓషో స్థానిక వార్తా పత్రికలో సహాయ సంపాదకునిగా పని చేశారు. వార్షిక సర్వ ధర్మ సమావేశంలో ప్రజలతో ప్రసంగించడం ప్రారంభించారు. 1955లో ఫిలాసఫీలో బాచిలర్స్ పూర్తి చేసుకున్న ఆయన, సగర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (ఫిలాసఫీ) డిగ్రీ పొందేందుకు వెళ్లారు. అనంతరం, జబల్‌పూర్ విశ్వవిద్యాలయములో, రైపూర్ సంస్కృత కళాశాలలో బోధించారు.

ఓషో ఆధ్యాత్మిక జీవితం

రాయ్‌పూర్లో సంస్కృత యూనివర్శిటీలో 1957లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన రజనీష్.. 1960లో జబల్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారు. అప్పుడు ఆయనొక మంచి ప్రొఫెసర్ గా గుర్తింపు సాధించారు. కానీ.. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి.. 1966లో భారత్ అంతటా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచి ప్రారంభమైన ఆయన ఆధ్యాత్మిక మార్గం.. మరణించే వరకు సాగింది. ఇతర ఆధ్యాత్మిక వేత్తలకు భిన్నంగా.. ఆయన దేశంలోని మతాల్ని, రాజకీయలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసే వారు.

ఓషో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తడబాటు లేకుండా మాట్లాడే వారు. తమ అభిప్రాయలపై ఓష్ కచ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. ఆయన అనేక సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని ప్రసంగాల్ని దేశంలో నిషేధించాలని చట్ట సభల్లో చర్చలు కూడా జరిగేవి అంటే.. ఆయన ఏ తీరుగా ప్రసంగించే వారో ఊహించుకోవచ్చు. రజనీష్ ప్రసంగాలకు అనేక వయస్సులు వారు హాజరయ్యే వారు. వివిధ మతాలకు చెందిన, వివిధ ఆచారాలకు చెందిన వ్యక్తులు ఈ ప్రసంగాలను వినేందుకు ఆయన దగ్గరకు వస్తుండే వారు. క్రమంగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆదరణ పెరగగా.. విదేశీయులు సైతం రావడం ప్రారంభించారు. తొలినాళ్లల్లో ఆయన ప్రసంగానికి 100-120 మంది శ్రోతలు ఉంటే.. మరికొన్ని సందర్భాల్లో 5-8 వేల మంది శ్రోతలు హజరయ్యే వారు.

ఓషో ఆశ్రమం

తొలుత ముంబయిలో ఓషో ఆశ్రమం ఉండేది. కానీ.. అక్కడి వాతావరణం సరిపోక.. ఓషోకు నిత్యం ఆరోగ్య సమస్యలు వస్తుండేవి. ఆయన కోసం విదేశాల నుంచి వచ్చే భక్తులు సైతం ముంబయిలోని విపరీతమైన వానల్ని తట్టుకోలేకపోయే వాళ్లు. దాంతో.. అనేక ఆలోచనల తర్వాత.. పుణేలోని కోరేగావ్ లో ఆయన ఆశ్రమం కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. 1981లో ఓషో అమెరికాలోని రేగాన్‌లోని వాస్కో కౌంటీలోని రాజనీష్‌పురం అనే ప్రదేశానికి వలస వెళ్లారు. అక్కడ తన వ్యక్తిగత కార్యదర్శి మానాండ శీలా పై కొన్ని నేరాలు ఉన్నాయని ఆయన స్థానిక అధికారులకు సూచించారు.

ఓషో ఆశ్రమం గురించి అనేక వివాదాలు, చర్చలు నిత్యం నడుస్తూ ఉండేవి. ఆయన ఆశ్రమంలో సె*క్స్ థెరపీ చాలా ముఖ్యమైంది. ఈ ఆశ్రమంలో ఎలాంటి పక్షపాతం లేకుండా లైంగికతను ఆమోదించారు. ఇక్కడ కట్టుబాట్లు, నైతికతకు చోటు లేదని బహిరంగంగానే చెబుతుండే వాళ్లు. అయితే.. ఈ థెరపీలో పాల్గొనేందుకు భారతీయులకు మాత్రం అనుమతించే వారు కాదు. అందుకు.. ఆయన సమర్థించుకునే వాళ్లు. విదేశీయుల జీవన విధానం, ఆలోచనాధోరణి భారతీయులకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతుండే వాళ్లు. విదేశీయులకు అలాంటి చికిత్సలు అవసరం అని, భారతీయులుకు నిశ్శబ్ద ధ్యానం సరిపోతుందని చెబుతుంటారు.

ఓషో తన అనుచరులను, సమాజాన్ని ఆధ్యాత్మిక మార్గంలో మార్పు చేసేందుకు ప్రేరేపించారు. ఆయన తన జీవితం మొత్తం స్వేచ్ఛ, ప్రేమ, శాంతి, ఆధ్యాత్మికతను పెంచేందుకు కృషి చేశారు. ఓషో మనసులోనే శాంతిని పొందడాన్ని, ఇతరుల అభిప్రాయాలను అంగీకరించడం, జీవితంలో సత్యాన్ని అన్వేషించడం వంటి అంశాలను పాఠంగా చెప్తూ ఉండేవారు. చివరిగా.. 1990 జనవరి 19న 58 ఏళ్ల వయసులో ఓషో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని పుణెలోని లావోత్జు హౌస్‌లో సమాధి చేశారు. ‘‘ఓషో ఎన్నడూ పుట్టలేదు, ఎన్నడూ మరణించలేదు. ఆయన ఈ భూమిని 1931 డిసెంబరు 11 నుంచి 1990 జనవరి 19 మధ్య సందర్శించారు’’ అని చెక్కించుకున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×