Ananya Nagalla: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడుతున్న విషయం తెల్సిందే. స్టాఫ్ మర్యాదగా ప్రవర్తించడం లేదని, తమ బ్యాగ్ లను సకాలంలో ఇవ్వడం లేదని సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. మొన్నటికి మొన్న మంచు లక్ష్మి సైతం ఇండిగో ఎయిర్ లైన్స్ పై మండిపడింది.
“ఇది కచ్చితంగా వేధించడమే. నా లగేజ్ బ్యాగ్ ను పక్కకి తోసేశారు. నాతో దురుసుగా ప్రవర్తించారు. కనీసం బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. చివరికి నా లగేజ్ కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. వాళ్ళు చెప్పింది వినకపోతే నా బ్యాగ్స్ ను గోవాలోని వదిలేస్తామన్నారు. ఒకవేళ నా బ్యాగ్స్ లో ఏదైనా వస్తువు మిస్ అయితే ఆ సంస్థ బాధ్యత తీసుకుంటుందా.. ? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్ లైన్స్ ను ఎలా నడపగలుగుతున్నారు. ఇకనుంచి ఈ ఎయిర్ లైన్స్ కు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు అనన్య కూడా తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచింది. “నేను ఈరోజు ఉదయం ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ నుండి మధురైకి ప్రయాణిస్తున్నాను. నేను రెండు బ్యాగేజీలను చెక్ చేయడానికి పంపాను. అందులో ఒకటి రావడానికి 6 గంటలు ఆలస్యమైంది. నేను కస్టమర్ కేర్‌ను సంప్రదించినప్పుడు వారు క్షమించండి.. దానిని అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో పంపుతామని చెప్పారు. ఇండిగో ఎయిర్ లెన్స్ ఇది ఆమోదయోగ్యం కాదు.
Upasana Konidela: ఎంత మాట అన్నావ్ ఉపాసన.. వారిని ఆంటీ అంటావా.. ఎంత ధైర్యం ?
మీకు వేరే రూల్స్.. కస్టమర్‌కు వేరే రూల్స్ ఎందుకు ఉన్నాయి. కస్టమర్ నుండి ఒక నిమిషం ఆలస్యమైతే.. ఇతర ప్రయాణీకులు మీ కోసం వేచి ఉండలేనందున మేము అనుమతించలేమని మీరు చెబుతారు. మరి ఇప్పుడు మీ 6 గంటల లగేజీ ఆలస్యం కారణంగా దాదాపు 2000 మంది విద్యార్థులు నా కోసం వేచి ఉన్నారు. క్షమించండి అంటే సరిపోతుందా.. ? అస్సలు కాదు. నేను కూడా మెరుగైన వ్యవస్థ కోసం ఆశిస్తున్నాను” అంటూ రాసుకొచ్చింది.
ఇక అనన్య పోస్ట్ పై ఇండిగో స్పందించింది. ” మిస్ నాగళ్ళ .. మీ సామాను మీ వద్దకు చేరుకోవడం ఎంత ముఖ్యమో మాకు అర్థమైంది. మీరు కౌంటర్ ముగింపు సమయానికి చేరుకున్నందున, అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో మీ బ్యాగ్ ను పంపిస్తామని చెప్పి.. మీ చెక్ ఇన్ టైమ్ ఇంకా ఈజీ చేసాం” అని చెప్పుకొచ్చింది. ఇక దీనికి సమాధానంగా అనన్య.. “ఎవరు ఇలా అడిగినా.. మీ దగ్గర ఉన్న ఆన్సర్ ను ఇలాగే కాపీ, పేస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నాను. కానీ, నా బ్యాగ్ వేరే విమానంలో ఉందని, మీరు ఒక బ్యాగ్ ను మాత్రమే తీసుకెళ్లుతున్నారని నాకు ఎవరు చెప్పలేదు. అలా రెండు బ్యాగ్ లు తీసుకెళ్లిన నేను.. ఒక బ్యాగ్ ను మాత్రమే ఎందుకు తీసుకుంటాను. నా బ్యాగ్ తదుపరి విమానంలో వస్తుందని నాకు తెలిస్తే నేను PIR ఫైల్ చేసి కస్టమర్ కేర్‌కి ఎందుకు కాల్ చేయాలి. దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి” అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గ మారింది.
I was travelling from Hyderabad to Madhurai today morning for an event . I have checked in two baggages and one of it got delayed for 6 hours. when i contacted the customer care they are simply saying sorry and they will send it in next available flight. @IndiGo6E this is… pic.twitter.com/WtbFgST7ff
— Ananya Nagalla (@AnanyaNagalla) February 14, 2025