Flower Face Mack: సాధారణంగా పూలను అలంకరణ, పూజకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. గులాబీ, మల్లె వంటి సువాసను వెదజల్లే పూలను ఫర్ఫ్యూమ్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే అన్ని రకాల పూలలో చర్మాన్ని పోషించడానికి అంతే కాకుండా రిఫ్రెష్ చేయడానికి, మెరుపు నివ్వడానికి సహాయపడే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లను కలిగి ఉంటాయి.
మీ ముఖం ప్రకాశవంతంగా కనిపించాలనుకుంటే పూలతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లను ఉపయోగించవచ్చు. మీ ముఖానికి తక్షణ మెరుపు తీసుకురావడానికి ఎలాంటి పూలతో ఫేస్ మాస్కులు తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజ్ వాటర్, ఫ్లవర్‌తో ఫేస్ మాస్క్:
గులాబీ పూలు చర్మానికి అద్భుతమైన మేలు కలిగిస్తాయి. గులాబీలో యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మం యొక్క రంగులను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కావాల్సనవి :
గులాబీ రేకులు- 7-8
తేనె- 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా గులాబీ రేకులను పేస్ట్ లా చేయండి. తర్వాత అందులో తేనె, రోజ్ వాటర్ కలపండి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మెరుస్తుంది. అంతే కాకండా ముఖంపై మచ్చలు కూడా రాకుండా ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం గులాబీ ఫేస్ మాస్క్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
2. మందార పూలతో ఫేస్ మాస్క్:
చర్మ పోషణకు సహాయపడే కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి పోషకాలు మందార పూలలో ఉంటాయి. దీంతో పాటు మందార పూలో విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది చర్మంపై మృత కణాలను తొలగించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
కావాల్సినవి:
మందార పువ్వు -2-3
ఓట్స్ – 2 టీస్పూన్లు
టీ ట్రీ ఆయిల్ – 2-3 చుక్కలు
తయారీ విధానం:
ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ముందుగా మందార పువ్వును రాత్రంతా చల్లటి నీటిలో నానబెట్టండి. తర్వాత మరుసటి రోజు ఉదయం లేచి మందార పూలను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో మందార పువ్వులు, ఓట్స్ పేస్ట్ లా చేసి అందులోనే టీ ట్రీ ఆయిల్ వేయండి. దీని తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ సిద్ధం చేయండి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్‌ని ముఖం మీద 15 నిమిషాలు అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి.
3. బంతి పూలతో ఫేస్ మాస్క్:
బంతి పూలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై టానింగ్, మొటిమలు వంటి సమస్యలను తొలగిస్తాయి. అందుకే వీటితో తయారు చేసిన ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కావాల్సినవి:
బంతి పువ్వులు – 2-3
పెరుగు – 2 స్పూన్లు
గంధపు పొడి – 1 స్పూన్
Also Read: ఆవ నూనెలో ఈ రెండు కలిపి వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు
తయారీ విధానం:
ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడం కోసం ముందుగా బంతి పూలను రాత్రంతా వేడి నీటిలో నానబెట్టండి. ఉదయం లేచిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి.
ఇప్పుడు అందులో పెరుగు, గంధపు పొడి వేసి కలపండి. అన్ని వస్తువులు కలిపిన తర్వాత, ఈ మిశ్రమాన్ని పేస్ట్‌గా తయారు చేయండి.తర్వాత ఈ పేస్టును ముఖానికి అప్లై చేయండి. ముఖం మీద దాదాపు 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మెరిసిపోతుంది.
రసాయనాలతో తయారు చేసిన ఫేస్ మాస్కులను వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా సహజంగా ఇంట్లోనే ఇలాంటి ఫేస్ మాస్కులను తయారు చేసుకుని వాడితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.