BigTV English
Advertisement

Anasuya:- విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై అన‌సూయ ట్వీట్‌.. రౌడీ ఫ్యాన్స్‌తో రంగ‌మ‌త్త వార్‌

Anasuya:- విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై అన‌సూయ ట్వీట్‌.. రౌడీ ఫ్యాన్స్‌తో రంగ‌మ‌త్త వార్‌


Anasuya:- స్టార్ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కి మ‌ధ్య మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వార్ మొద‌లైంది. ఇంత‌కీ ఈ వార్ ఎందుకు మొద‌లైంద‌ని అనుకుంటున్నారా? విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా పోస్ట‌ర్‌లో హీరో హీరోయిన్ల పేర్లు కూడా ప్రింట్ చేశారు. అందులో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ముందు ది విజ‌య్ దేవ‌ర‌కొండ అని రాసి ఉండ‌టంపై అన‌సూయ కౌంట‌ర్ ఇచ్చింది. ది అనే ప‌దాన్ని యూనిక్ వ‌స్తువుల ముందే ఉప‌యోగిస్తుంటారు. ‘ఇప్పుడే ఒకటి చూశాను ‘ది’ నా బాబోయ్ .పైత్యం ఏం చేద్దాం అంటకుండా చూసుకుందాం’ అని కామెంట్ పెట్టింది. అన‌సూయ చేసిన ట్వీట్‌ను చూసిన రౌడీ స్టార్ ఫ్యాన్స్‌కి ఎక్క‌డో కాలింది. దాంతో వాళ్లు రంగంలోకి దిగి అన‌సూయ‌ను ట్రోల్ చేయ‌టం మొద‌లు పెట్టారు.

అమితాబ్‌, ర‌జినీకాంత్‌, చిరంజీవిలాంటి వాళ్లే వాళ్ల పేర్ల ముందు ది అని పెట్టుకోలేదు. అలాంటి విజ‌య్ దేవ‌ర‌కొండ పెట్టుకోవటం ఏంట‌ని కొంద‌రు అన‌సూయ‌కు స‌పోర్ట్‌గా ట్వీట్ చేస్తున్నారు. కానీ రౌడీ ఫ్యాన్స్ మాత్రం ఇత‌ర హీరోల‌కు లాగా మా హీరో ముందు ఎలాంటి బిరుదు లేదు. అందుక‌నే అలా పెట్టుకున్నాడు మీకేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రౌడీ ఫ్యాన్స్ ట్వీట్స్‌కు అన‌సూయ ఏం బెద‌ర‌టం లేదు. ఆమె కూడా గట్టిగానే కౌంట‌ర్ వేసింది. ‘భలే రియాక్ట్ అవుతున్నార్రా! ఎక్క‌డో నేను చెప్పింది క‌రెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నారు’ అంటూ సెటైర్ విసిరింది.


అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌సూయ మ‌ధ్య ఈ వార్ ఇప్ప‌టిది కాదు.. అర్జున్ రెడ్డి స‌మ‌యం నుంచి జ‌రుగుతుంది. అ సినిమాలో హీరో పాత్రధారి బూతు ప‌దం వాడ‌టంపై అన‌సూయ విమ‌ర్శ‌లు చేసింది. దానికి విజ‌య్ దేవ‌ర‌కొండ సైతం అన‌సూయ‌ను ఇన్ డైరెక్ట్‌గా టార్గెట్ చేశాడు. త‌ర్వాత లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయిన‌ప్పుడు మ‌రోసారి అన‌సూయ, విజయ్ దేవ‌కొండ‌ని టార్గెట్ చేసింది. అమ్మ‌ని తిట్టిన వాడు బాగుప‌డ‌లేదు. ఇప్పుడ‌దే జ‌రిగిందంటూ కామెంట్స్ విసిరింది. అప్పుడు రౌడీ స్టార్స్ ఫ్యాన్స్‌కి, అనసూయ‌కి ట్వీట్స్ వార్ న‌డిచింది. ఇప్పుడు మ‌రోసారి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను అన‌సూయ టార్గెట్ చేయ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×