BigTV English
Advertisement

Mahesh Babu:- మ‌హేష్ స్పెష‌ల్ ట్రెనింగ్‌!

Mahesh Babu:- మ‌హేష్ స్పెష‌ల్ ట్రెనింగ్‌!


Mahesh Babu:- సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ మూవీ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌కి సమ‌యం ఉండ‌టంతో మ‌న స్టార్ హీరో ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిపోయారు. ఇది బ‌య‌ట‌కు వినిపిస్తోన్న న్యూస్‌. అయితే సినీ వ‌ర్గాల్లో మాత్రం మ‌రోలా వార్త‌లు వినవ‌స్తున్నాయి. అదేంటంటే మ‌హేష్ స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకోవ‌టానికే విదేశాల‌కు వెళ్లారు. ట్రైనింగ్ అంటే ఏదో మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవ‌టానికి అని అనుకోవ‌ద్దు. ఆయ‌న ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌, మెంట‌ల్ స్ట్రెంగ్త్‌కు సంబంధించిన విష‌యాల‌పై ఫోక‌స్ పెట్ట‌టానికే ఈ ట్రైనింగ్ అని స‌మాచారం.

ఈ ట్రైనింగ్ కోసం మ‌హేష్ స్పెయిన్‌కు వెళ్లారు. వెకేష‌న్ పూర్తి కాగానే న‌మ్ర‌త‌, పిల్ల‌ల‌ను ఇంటికి పంపేసిన మ‌హేష్.. ఇద్ద‌రు ముగ్గురు స‌న్నిహితుల‌తో ఇప్పుడు స్పెయిన్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నెల 15 నాటికి మ‌హేష్ త‌న స్పెష‌ల్ ట్రైనింగ్‌ను ముగించుకుని ఇండియాకు తిరిగి వ‌స్తార‌నే అప్పుడే SSMB 28 స్టార్ట్ అవుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.


ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌ర్కారు వారి పాట త‌ర్వాత మ‌హేష్ చాలా కాస్త ఎక్కువ గ్యాప్‌నే తీసుకున్నారు. అందుకు ఆయ‌న వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా తోడ‌య్యాయి. రీసెంట్‌గానే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో SSMB 28ను స్టార్ట్ చేశారు. దీన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో తొలిసారి మహేష్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దీని త‌ర్వాత వ‌చ్చే ఏడాదిలోనే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నారు సూప‌ర్ స్టార్‌. ఇప్ప‌టికే జ‌క్క‌న్న దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×