E-Paper
Advertisement

OTT Movie : కూతురు కిడ్నాప్… తండ్రి బ్రూటల్ మర్డర్స్ చూస్తే గుండె జారిపోద్ది

OTT Movie : కూతురు కిడ్నాప్… తండ్రి బ్రూటల్ మర్డర్స్ చూస్తే గుండె జారిపోద్ది
Advertisement

OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే చాలామంది చెవి కోసుకుంటారు. అందులోనూ హాలీవుడ్ సినిమాలు యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమాలను ఇష్టపడుతూ చూస్తారు. అయితే ఈ మూవీలో కూతుర్ని కాపాడుకునేందుకు, హీరో విలన్స్ ని దారుణంగా చంపుతుంటాడు. ఇందులో వైలెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. థియేటర్లలో ఈ మూవీ మంచి విజయాన్ని తెచ్చి పెట్టడమే కాకుండా, హీరోకి యాక్షన్ హీరోగా పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టేకెన్’ (Taken). దీనికి  పియరీ మోరెల్ దర్శకత్వం వహించారు. ఇందులో లియామ్ నీసన్, మ్యాగీ గ్రేస్, లేలాండ్ ఓర్సర్, జోన్ గ్రీస్, డేవిడ్ వార్షోఫ్‌స్కీ, కేటీ కాసిడీ, హోలీ వాలెన్స్ నటించారు. ఈ మూవీ ఒక మాజీ CIA అధికారి అయిన బ్రయాన్ మిల్స్, ఫ్రాన్స్‌లో విహారయాత్రలో ఉన్నప్పుడు, అతని కుమార్తె కిమ్, ఆమె స్నేహితురాలు అమండాను కిడ్నాప్ అవుతారు. కూతురిని కాపాడుకోవడానికి తండ్రి చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. 2008 ఫ్రాన్స్‌లో ‘టేకెన్’ విడుదలైంది.  $25 మిలియన్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కగా,  $226 మిలియన్లు వసూలు చేసి ఈ మూవీ విజయాన్ని సాధించింది. అనేక మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నీసన్ కెరీర్‌లో ఒక మలుపు రాయి గా  పేర్కొన్నాయి.  అది అతనికి యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చి పెట్టింది.  ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

బ్రియాన్ మిల్స్ ఒక మాజీ CIA ఆఫీసర్. అతను తన భార్య లెనోర్ నుండి విడిపోయి, తన 17 ఏళ్ల కూతురు కిమ్ తో సమయం గడపడానికి  ప్రయత్నిస్తుంటాడు. కిమ్ తన తల్లి, ఒక ధనవంతుడైన సవతి తండ్రి స్టువర్ట్‌తో కలిసి జీవిస్తుంది. ఒక రోజు  కిమ్ తన స్నేహితురాలు అమండాతో కలిసి పారిస్‌కు విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటుంది. బ్రియాన్ మొదట్లో ఒప్పుకోడు, కానీ ఆమె తల్లి ఒత్తిడి మీద అనుమతిస్తాడు. కిమ్ అమండా పారిస్‌కు చేరుకున్న కొద్ది సమయంలోనే, వారు అల్బేనియన్ హ్యూమన్ ట్రాఫికర్ల చేతిలో కిడ్నాప్ అవుతారు. బ్రియాన్ ఫోన్‌లో కిమ్‌తో మాట్లాడుతున్నప్పుడే ఈ సంఘటన జరుగుతుంది. ఆమెను తీసుకెళ్లే ముందు బ్రియాన్ ఒక కిడ్నాపర్‌తో కిమ్ ఫోన్ లోనే మాట్లాడతాడు.  బ్రియాన్ వాళ్ళతో మాట్లాడుతూ, మీరు ఎక్కడున్నా వెతికి మరీ చంపుతాను అని కోపంగా అంటాడు. ఆ తరువాత బ్రియాన్ వెంటనే పారిస్‌కు బయలుదేరతాడు. తన CIA శిక్షణ, నైపుణ్యాలను ఉపయోగించి కూతురిని కనుగొనేందుకు ఒక యుద్ధాన్నే ప్రారంభిస్తాడు. అతను కిడ్నాపర్లను వెంబడిస్తూ, అడ్డొచ్చిన అనేక మందిని చంపుతూ వెళతాడు.  చివరికి కిమ్‌ను ఒక ధనవంతుడైన షేక్‌కు అమ్మేందుకు కిడ్నాపర్స్ ప్రయత్నిస్తుంటారు .  ఈ క్రమంలో అక్కడికి చేరుకోవడానికి బ్రియాన్ అనేక అడ్డంకులను ఎదుర్కొంటాడు.  చివరికి బ్రియాన్ తన కూతుర్ని కాపాడుకుంటాడా ? ఆ నెరస్తుల అంతు చూస్తాడా ? అనే ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×