Anasuya Bharadwaj: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). కానీ ‘పుష్ప’లో కథను పూర్తిగా చెప్పకుండా రెండో భాగంలో చూసుకోండి అంటూ మధ్యలోనే ఆపేశాడు దర్శకుడు. దీంతో ‘పుష్ప 2’పై మొదటినుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ షూటింగ్ లేట్ అవ్వడం, ఎలాంటి అప్డేట్స్ బయటికి రాకపోవడం, విడుదల తేదీ వరుసగా వాయిదా పడుతూ ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ‘పుష్ప 2’ కోసం క్రియేట్ అయిన హైప్ మెల్లమెల్లగా తగ్గిపోతోంది. కానీ తాజాగా ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).
దాక్షాయణిగా అనసూయ
బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న అనసూయ.. మెల్లగా వెండితెరపైకి డైవర్ట్ అయ్యింది. దీంతో బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో రంగమత్త క్యారెక్టర్‌లో కనిపించి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. రంగమత్త పాత్రలో ఒదిగిపోయినందుకు అనసూయకు యాక్టర్‌గా మరెన్నో అవకాశాలు వస్తాయని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ సుకుమారే పిలిచి ‘పుష్ప’లో తనకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా దాక్షాయణిగా నటించి మరోసారి తన నటనతో ఫిదా చేసిన అనసూయ.. ‘పుష్ప 2’ గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read: సాయి పల్లవిని వెలివేస్తున్న ప్రేక్షకులు, ట్విటర్‌లో ట్రెండింగ్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
కథలో లోతు
బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఆ ఎపిసోడ్‌కు అనసూయ గెస్ట్‌గా వచ్చింది. బిగ్ బాస్ స్టేజ్‌పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు కంటెస్టెంట్స్‌తో కూడా ముచ్చటించింది. అదే సమయంలో ‘పుష్ప 2’ (Pushpa 2) గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది. మొదటి భాగంలో చూపించిన కథనే మరింత లోతుగా ఈ సీక్వెల్‌లో చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ‘పుష్ప 2’లో ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి ఒక హై మూమెంట్ ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ఇప్పటికే ఈ మూవీ ఒక రేంజ్‌లో ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు.
ఒకరోజు ముందే
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. 6 అనేది బన్నీ లక్కీ నెంబర్ కాబట్టి కచ్చితంగా ఈ సినిమా ఈసారి పోస్ట్‌పోన్ అవ్వదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 5కే విడుదల తేదీని మార్చారు మేకర్స్. ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం కోసం భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే ‘పుష్ప 2’ ఒకరోజు ముందే వస్తుండడంతో ఫ్యాన్స్ అంతా మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక అనసూయ కూడా ప్రతీ 10 నిమిషాలకు హై మూమెంట్ అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సైతం ఇటీవల ‘పుష్ప 2’ హిట్‌పై నమ్మకం వ్యక్తం చేశాడు.