Sai Pallavi: ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లంటే మాత్రమే అందరిలో పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా తనను తిట్టేవాళ్లు, విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. కానీ కొందరు మాత్రమే కేవలం ప్రేక్షకుల దగ్గర నుండి అభిమానాన్ని, ప్రేమను పొందగలరు. అలాంటి హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. అసలు అందరు హీరోయిన్స్ అంతా ఒకవైపు ఉంటే.. సాయి పల్లవి (Sai Pallavi) మాత్రమే డిఫరెంట్ అని తన ఫ్యాన్స్ అంతా ప్రశంసల్లో ముంచేస్తుంటారు. కానీ తాజాగా తనపై కూడా నెగిటివిటీ మొదలయ్యింది. ఒక్కసారిగా ట్విటర్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
అర్హత లేదు
సాయి పల్లవికి వెంటవెంటనే సినిమాలు చేయడం నచ్చదు. తనకు కథ నచ్చాలి, అందులో తన పాత్ర నచ్చాలి. అలా అయితే ఒక మూవీని ఓకే చేస్తుంది. అలాగే ఎంతో ఆలోచించి ‘అమరన్’ (Amaran) అనే సినిమాను ఓకే చేసింది. ఇది మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్. అయితే ఇలాంటి ఒక భారత సైనికుడి బయోపిక్‌లో తన భార్యగా నటించే అర్హత సాయి పల్లవికి లేదంటూ నెటిజన్లు తనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’లో కూడా సీతగా సాయి పల్లవి నటించడం ఒప్పుకోమంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి వైరల్ అయిన సాయి పల్లవి పాత వీడియోనే కారణం.
Also Read: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న లేడీ సూపర్ స్టార్.. క్లారిటీ ఇదే..!
ఉగ్రవాదుల్లాగా కనిపిస్తాం
సాయి పల్లవి తను నటించిన ‘విరాట పర్వం’ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పటికీ తనపై నెగిటివిటీ వచ్చేలా చేస్తోంది. ‘అమరన్’ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే మరోసారి ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హింస గురించి సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ‘‘పాకిస్థాన్‌లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూప్‌లాగా భావిస్తారు. కానీ మనకు పాకిస్థాన్ సైన్యం టెర్రరిస్టుల్లాగా కనిపిస్తుంది. అలా అభిప్రాయాలు మారుతుంటాయి. నాకు అస్సలు ఈ హింస అంతా ఎందుకో అర్థం కాదు’’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవ్వడంతో సాయి పల్లవిపై నెగిటివిటీ తప్పడం లేదు.
మనోభావాలు దెబ్బతిన్నాయి
ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి అలా మాట్లాడి ఇప్పుడు మేజర్ ముకుంద్ బయోపిక్ అయిన ‘అమరన్’లో ఎలా నటించావంటూ తనను ప్రశ్నిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఒకప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేసింది సాయి పల్లవి. అప్పుడు కూడా తనపై ఈ రేంజ్‌లోనే నెగిటివిటీ వచ్చింది. తన పని తను చేసుకుంటూ.. నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా తనపై ఇంత నెగిటివిటీ చూపించాలా అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ వాపోతున్నారు. ట్విటర్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి (Boycott Sai Pallavi) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం వల్ల ‘అమరన్’ మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమో అని భయపడుతున్నారు.