Anaswara Rajan: తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హీరోహీరోయిన్లు స్వయంగా రంగంలోకి దిగక తప్పదు. అదే సమయంలో ఫ్యాన్స్‌ను కలవడం, ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేయడం.. ఇవన్నీ ప్రమోషన్స్‌లో భాగమే. కానీ ఈ ప్రమోషన్స్ వల్ల, దానికి హాజరయ్యే కొందరు ఫ్యాన్స్ వల్ల హీరోహీరోయిన్లకు ఇబ్బందులు తప్పవు. చాలావరకు అందరి ముందు కోప్పడకుండా కూల్‌గా ఉండడానికే ప్రయత్నిస్తారు సినీ సెలబ్రిటీలు. తాజాగా ఒక హీరోయిన్ విషయంలో కూడా అదే జరిగింది. తన అప్‌కమింగ్ సినిమా ప్రమోషన్స్ కోసం స్పెషల్‌గా ఫ్యాన్ మీట్‌ను ఏర్పాటు చేయగా అందులో మలయాళ ముద్దుగుమ్మ అనశ్వర రాజన్ పాల్గొంది. అందులో ఒక ఫ్యాన్ తనను ఇబ్బందికి గురిచేశాడు.
ప్రమోషన్స్ కోసమే
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోహీరోయిన్లుగా మారినవారు ప్రతీ ఇండస్ట్రీలో ఉన్నారు. మాలీవుడ్‌లో అయితే అలాంటి వారి సంఖ్య కాస్త ఎక్కువే. అందులో అనశ్వర రాజన్ కూడా ఒకరు. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సెకండ్ హీరోయిన్ పాత్రల్లో కూడా కనిపించింది. ఇప్పుడు మెల్లగా తనకంటూ ఒక గుర్తింపు లభించింది. అందుకే అనశ్వర రాజన్‌కు హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అనశ్వర నటించే సినిమాలకు కేరళలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘పైన్కిలి’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది అనశ్వర రాజన్.
ఇబ్బందిపెట్టిన ఫ్యాన్స్
సజిన్ గోపు, అనశ్వర రాజన్ జంటగా నటించిన చిత్రమే ‘పైన్కిలి’. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం ఒక ఫ్యాన్ మీట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో చాలావరకు తన ఫ్యాన్స్‌తో సంతోషంగా నవ్వుతూనే మాట్లాడింది అనశ్వర. ఒక ఫ్యాన్ తనకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేసినా కూడా తను నవ్వుతూ తీసుకొని తనకు హగ్ కూడా ఇచ్చింది. అలా ఫ్యాన్ మీట్ అంతా సరదాగా సాగిపోయినా.. మధ్యలో ‘ఒక పాట పాడండి అనశ్వర’ అంటూ ఫ్యాన్స్‌లో నుండి ఒక వ్యక్తి అరిచాడు. అది అనశ్వరకు నచ్చలేనట్టుంది. అందుకే మైక్‌ను దూరంగా పెట్టి తనను ఏదో తిట్టినట్టుగా అనిపించింది. ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్ తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని ఆ మూమెంట్‌లో అనశ్వర మొహం చూస్తే అర్థమయిపోయింది.
Also Read: ఆ పని చేసినందుకు లెస్బి*యన్ అనుకున్నారు… మాధవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చేతినిండా సినిమాలు
అనశ్వర రాజన్ (Anaswara Rajan) చివరిగా ‘రేఖాచిత్రం’ (Rekhachithram) అనే మూవీలో నటించింది. ఈ సినిమా ఇతర భాషల్లో డబ్ అవ్వకపోయినా కేవలం మలయాళ భాషల్లోనే ఇతర రాష్ట్రాల్లో కూడా విడుదలయ్యింది. హైదరాబాద్‌లో కూడా ఈ సినిమా మలయాళ భాషలో విడుదల కాగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో అనశ్వర రాజన్ నటన అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. రోజురోజుకీ మాలీవుడ్‌లో అనశ్వర క్రేజ్ పెరిగిపోతుండడంతో మేకర్స్ కూడా తననే హీరోయిన్‌గా క్యాస్ట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ప్రస్తుతం తన చేతిలో దాదాపు అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి.