AP Pension Scheme: ఏపీ పింఛన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ని రోజులుగా పింఛన్ దారులు ఎదుర్కొంటున్న ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనితో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏమిటో తెలుసుకుందాం.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి, పింఛన్ దారులకు వరుస శుభవార్తలు చెబుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ నగదును పెంచిన విషయం తెలిసిందే. అలా పెంచిన నగదును ప్రతినెలా ఒకటో తేదీన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అయితే సాధారణంగా ప్రభుత్వ సామాజిక పింఛన్ పొందే వ్యక్తి మృతి చెందిన సమయంలో, అతని భార్యకు పింఛన్ మంజూరు కావడానికి మరల దరఖాస్తు చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రభుత్వం ఆ ఇబ్బందులకు చెక్ పెడుతూ.. పింఛన్ దారుడు మృతి చెందిన మరుసటి నెల నుండి నుండి ఆ నగదును సంబంధిత వ్యక్తి భార్యకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఎందరో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు మేలు చేకూరింది.
తాజాగా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ సైతం పింఛన్ దారులకు చెప్పింది. కొందరు పింఛన్ దారులు.. ఇతరత్రా కారణాల రీత్యా వేరే జిల్లాలకు, మండలాలకు వలస వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. వారు ప్రతి నెలా.. తమకు పింఛన్ మంజూరైన మండలానికి వచ్చి నగదు పొందాల్సిన పరిస్థితి ఉంది. అందుకే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు.. రవాణా సాగించాల్సిన పరిస్థితి. ఇటువంటి ఇబ్బందులకు శుభం కార్డు వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పింఛన్ పొందేవారు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో.. వారు తాము నివసించే మండలానికి జిల్లాకు మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
Also Read: Nara Lokesh: బంపర్ ఆఫర్ ప్రకటించిన లోకేష్.. ఆ పనిలో పడ్డ వైసీపీ?
ఇలా మార్పు చేసుకోదలచిన వారు ముందుగా.. తమ సచివాలయానికి వెళ్లి వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంప్రదించాలి. ఎక్కడికి పింఛన్ అకౌంట్ ను బదిలీ చేయాలో, ఆ సచివాలయం కోడ్ నెంబర్ ను తెలియజేసిన వెంటనే.. మరుసటి నెల నుండి కోరుకున్న గ్రామంలో పింఛన్ నగదును పొందవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎందరో వృద్ధులు, వికలాంగులకు రవాణా సమస్యలు తీరినట్లేనని పింఛన్ దారులు తెలుపుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. వెంటనే మీ సచివాలయాన్ని సంప్రదించండి.