Anasuya: ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ (Anasuya ) ఈమధ్య కాలంలో జడ్జిగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2’ షో కి ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Sekhar Mastar) తో కలిసి జడ్జ్ గా వ్యవహరిస్తోంది. తన జడ్జ్ మెంట్ తో అందరి హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తాజాగా యూనిట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
అనసూయకి శ్రీముఖి సర్ప్రైజ్..
ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) అనసూయకు సర్ప్రైజ్ అంటూ డిస్ప్లే పై ఒక పిక్చర్ వేసింది. ఆ ఫోటో చూసిన తర్వాత ఆశ్చర్యపోయిన అనసూయ.. బంధాలను మెయింటైన్ చేయడంలో తాను చాలా వీక్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
షోలో సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన అనసూయ ఫస్ట్ డిజైనర్..
తాజాగా అనసూయ జడ్జిగా వ్యవహరిస్తున్న కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ఒక షార్ట్ వీడియోను నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో శ్రీముఖి అనసూయ..ఇంకొక అమ్మాయితో ఉండే ఫోటోని రివీల్ చేశారు. ఆ ఫోటో చూడగానే ఆశ్చర్యపోయిన అనసూయ మాట్లాడుతూ..”ఈమె నా మొదటి డిజైనర్ సుదీప. ఒక అద్భుతమైన డిజైనర్. ఈమె నుంచే నేను ఫ్యాషన్ టర్మినాలజీ నేర్చుకున్నాను. ముఖ్యంగా తాను చేసే డిజైన్ ఎలా ఉంటుందంటే చూసేవారు ఇట్టే స్టన్ అయిపోవాల్సిందే. అంత అద్భుతంగా డిజైన్ చేస్తుంది”. అంటూ అనసూయ చెబుతూ ఉండగానే.. తన పెళ్లినాటి ఫోటోలో తన పక్కనే ఉన్న సుదీప పిక్చర్ ని కూడా డిస్ప్లే చేశారు.
తప్పంతా నాదే.. ఆ విషయంలో నేను చాలా వీక్ – అనసూయ..
దీంతో మురిసిపోయిన అనసూయ మాట్లాడుతూ..” తప్పంతా నాదే.. నేను రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడంలో చాలా బ్యాడ్” అంటూ చెబుతుండగానే వెంటనే సుదీప స్టేజ్ పై ప్రత్యక్షమైంది. ఆమెను చూసి సంతోషంలో అనసూయ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. ఇక వెంటనే సుదీప మాట్లాడుతూ.. “తప్పు ఎవరిది లేదు కాలం అలా నిర్ణయిస్తుంది” అంటూ కామెంట్లు చేసింది. మొత్తానికైతే అనసూయ స్టేజ్ పై తన ఫస్ట్ డిజైనర్ అలాగే తన స్నేహితురాలని కలుసుకొని ఎగ్జైట్ అయిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనసూయ కెరియర్..
ఎన్టీఆర్ (NTR) హీరోగా వచ్చిన ‘ నాగ’ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా కూడా పనిచేసింది. అక్కడ చేస్తున్న సమయంలోనే జబర్దస్త్ (Jabardast)లోకి అడుగుపెట్టి , యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనసూయ.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ షోలో తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, స్టైలిష్ లుక్ తో గ్లామర్ గా కనిపించి అందరి హృదయాలు దోచుకుంది.
అనసూయ సినిమాలు..
ఒకవైపు జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగుతుండగానే.. మరొకవైపు సుకుమార్ (Sukumar), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో అవకాశం అందుకుంది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. అంతేకాదు ‘రజాకార్’ సినిమాతో కూడా మరింత పాపులారిటీ అందుకుంది.ఇక మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా చేసిన పుష్ప, పుష్ప2 సినిమాలలో కూడా నటించి భారీ పాపులారిటీ అందుకుంది అనసూయ. ఈమధ్య స్పెషల్ సాంగ్స్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా మరింత ఆకట్టుకుంటుంది.
?utm_source=ig_web_copy_link
ALSO READ: Vijayashanti: విజయశాంతి రాజకీయ ఎంట్రీ వెనుక ఆయన హస్తం ఉందా.. వెలుగులోకి నిజాలు!