TGPSC Results: తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రొవిజన్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ అధికారులు రిలీజ్ చేశారు. మొత్తం 574 మంది పోస్టులకు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 581 పోస్టులకు గానూ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం లక్షా 45వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: tspsc.gov.in
2024 జూన్ 24 నుంచి 29 వరకు తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షలు జరిగాయి. కంప్యూటర్ బేస్ డ్ ద్వారా రాత పరీక్షలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 581 పోస్టులకు గాను లక్షా 45వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోయిన సంవత్సరం జూన్ నెలలో పరీక్షలు జరుగగా… ఇప్పటికే జీఆర్‌ఎల్ ను టీజీపీఎస్సీ అధికారులు రిలీజ్ చేశారు. నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌ను పూర్తి చేసింది. తాజాగా తుది ఫలితాలు రిలీజ్ అయ్యాయి.
ALSO READ: IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు