Anchor Syamala: ఎన్నికల ప్రచారం నుంచి యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం ఆమె పవన్ కళ్యాణ్ గురించి తక్కువ చేసి మాట్లాడడమే. ఎన్నికల్లో వైసీపీ కి సపోర్ట్ గా నిలబడిన శ్యామల.. ఈసారి కూడా జగనే గెలుస్తాడు అని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.
” ఆవేశపడి ఆయాసపడటమే తప్ప, పవన్ కళ్యాణ్ గారు తోటివారికి సహాయపడుతుండగా నేనెప్పుడూ చూడలేదు.. సహాయ పడ్డట్టు నేనెక్కడా వినలేదు కూడా.. ఈసారి కచ్చితంగా జగన్ గెలుస్తాడు” అని అంటూ చెప్పుకొచ్చింది. ఇక మొదటి నుంచి పవన్ కు విరుద్ధంగా మాట్లాడినవారందరికి.. ఆయన అధికారంలోకి వచ్చాకా.. పవన్ ఫ్యాన్స్ ఇచ్చిపడేస్తున్నారు. పవన్ ను ఎన్ని మాటలు అంటారు అని నెగటివ్ గా ట్రోల్ చేసినవారందరిపై ఫైర్ అవుతున్నారు.
వేణుస్వామి ని అలాగే భయపెట్టి జ్యోతిష్యం చెప్పడమే మాన్పించారు. ఇక ఇప్పుడు శ్యామల మీద పడ్డారు. ఇక దీంతో శ్యామల కెమెరా ముందుకు వచ్చి.. ఈ దాడులు ఆపమని కోరింది. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు అని మొదలుపెట్టి.. పవన్ ఫ్యాన్స్ తనను బెదిరిస్తున్నారని, భయపెడుతూ కాల్స్ చేస్తున్నారని వాపోయింది.
దయచేసి ఇలాంటి వాటిని ఆపమని వేడుకుంది. తనకు నచ్చించి చెప్పాను అని.. నచ్చింది చెప్పడమా తప్పు కాదు అని తెలిపింది. మీ నాయకులే చెప్తున్నారు.. ఎక్కడ ఎలాంటి పదాలు.. మాటలు తూలొద్దు.. జాగ్రత్తగా ఉండండి అని.. మీరు ఆ సందేశాన్ని పాటిస్తారని అనుకుంటున్నాను.. దయచేసి నన్ను వేధించకండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ శాంతిస్తారేమో చూడాలి.