Manchu Manoj: తేజ సజ్జ (Teja Sajja)ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మిరాయ్(Mirai). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ సెప్టెంబర్ 12న ఏకంగా 8 భాషలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు. తాజాగా సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది.
విలన్ పాత్రలో మంచు మనోజ్..
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు మనోజ్(Manchu Manoj) కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదివరకే విడుదల చేసిన ట్రైలర్ చూస్తే మాత్రం మనోజ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ మిరాయ్ 2(Mirai 2) కూడా ఉండబోతుంది అంటూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు ఫ్రాంచైజీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మిరాయ్ 2 కూడా రాబోతుందనే విషయాన్ని మనోజ్ వెల్లడించారు.
మిరాయ్ 2 ఉండబోతుందా?
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని సినిమా అని తెలియజేశారు. ఒక చిచ్చర పిడుగు లాగా.. ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని, ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారని మనోజ్ వెల్లడించారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా ఎడిటర్ గాను,డీఓపీగా కూడా పనిచేశారని మనోజ్ వెల్లడించారు. ఇక మిరాయ్ ఒక భాగం మాత్రమే కాదని సెకండ్ పార్ట్ లీడ్ తో ఉండబోతోంది అంటూ మనోజ్ వెల్లడించారు. ఇలాంటి ఒక గొప్ప యూనివర్స్ లో తాను భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ మనోజ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ధర్మాన్ని కాపాడే యోధుడు…
ఇక తేజ సజ్జ హనుమాన్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని కూడా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇందులో తేజా సజ్జ ధర్మాన్ని కాపాడే యోధుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అశోకుడు కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలను తరతరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధుల గురించి సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా, జగపతిబాబు, శ్రియ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!