BigTV English

Anchor Syamala: పవన్ కళ్యాణ్ నీతులే చెప్తాడు.. మళ్లీ కెలికిన యాంకర్ శ్యామల

Anchor Syamala: పవన్ కళ్యాణ్ నీతులే చెప్తాడు.. మళ్లీ కెలికిన యాంకర్ శ్యామల

Anchor Syamala: యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. షోస్ ద్వారా ఆమె ఎంత ఫేమస్ అయ్యిందో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడిన వ్యాఖ్యల వలన మాత్రం బాగా ఫేమస్  అయ్యింది. గతేడాది ఎన్నికల ప్రచారం నుంచి యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైసీపీకి సపోర్ట్ గా శ్యామల పెద్ద పెద్ద శపధాలే చేసింది. “ఆవేశపడి ఆయాసపడటమే తప్ప, పవన్ కళ్యాణ్ గారు తోటివారికి సహాయపడుతుండగా నేనెప్పుడూ చూడలేదు.. సహాయ పడ్డట్టు నేనెక్కడా వినలేదు కూడా.. ఈసారి కచ్చితంగా జగన్ గెలుస్తాడు” అని   చెప్పుకొచ్చింది. ఆ ఒక్క మాట  అప్పుడు శ్యామల అనకుండా ఉండాల్సింది.


జగన్ పై అభిమానం ఉండడం తప్పు లేదు కానీ, మిగతావారిని తక్కువ  చేసి చూడకూడదు అనేది ఆమె తెలుసుకోలేకపోయింది. శ్యామల మాటలు  పవన్ ఫ్యాన్స్ ను బాగా  హర్ట్ చేశాయి. జగన్ గెలుస్తాడు  అన్న నమ్మకంతో శ్యామల ఆ మాటలు మాట్లాడింది. కానీ, పవన్ గెలిచేవాడు. దీంతో అమ్మడి సీన్ రివర్స్ అయ్యింది. అధికారంలోకి వచ్చాక  ఎవరైతే పవన్ ను తక్కువ చేసి మాట్లాడారో.. వారందరి లెక్కలు తేల్చడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఆ లిస్ట్ లో శ్యామల  కూడా ఉంది.

Urvashi Rautela : దబిడి డబిడి సాంగ్ కు హాట్ బ్యూటీ రెమ్యునరేషన్.. మాస్ సాంగ్ కు కోట్లు?


వేణుస్వామిని అలాగే భయపెట్టి జ్యోతిష్యం చెప్పడమే మాన్పించేసిన ఫ్యాన్స్.. శ్యామలను సైతం వదలకుండా ఇచ్చిపడేశారు. దీంతో ఆమె  ఒక వీడియోలో తనపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరింది. ”  క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం” అంటూ మొదలుపెట్టి.. తనకు  ఎంత నరకం చూపిస్తున్నారో చెప్పి దండం పెట్టి వదిలేయమని బ్రతిమిలాడింది. ఇక అక్కడితో అక్క.. సైలెంట్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ కూడా శాంతించారు.

ఇక ఇప్పుడు మరోసారి శ్యామల రెచ్చిపోయింది. గేమ్ ఛేంజర్  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక అయ్యాక ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించినవిషయం తెల్సిందే. దీంతో పవన్ కళ్యాణ్ ను దుమ్మెత్తిపోయడానికి వారికి ఒక అంశం దొరికినట్లయ్యింది. అల్లు అర్జున్ కేసును ఈ రోడ్డు ప్రమాదానికి  లింక్ చేసి.. పవన్ ను విమర్శించడం మొదలుపెట్టారు. ఇప్పటికే రోజా.. ఎక్స్ వేదికగా  పవన్ .. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది. ఇక అదే విధంగా శ్యామల  కూడా పవన్ పై మండిపడుతూ  పోస్ట్ పెట్టుకొచ్చింది.

Vishal: విశాల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్.. అసలేమైందంటే.. ?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్ప‌డం వ‌ర‌కే.. ఆచ‌ర‌ణ‌లో ఉండ‌వు. గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు . కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారు స‌ర్ SEIZE THE ROAD… అనాలి క‌దా?.

సినిమాల‌కు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈల‌లు వేసి గోల చెయ్యండి అంటూ యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ మీరు మాట్లాడిన మాట‌లు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాట‌లేనా మీ కార‌ణంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతో క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయ‌కుల ప్రాణాలు బ‌లి చేస్తున్నారా” అంటూ రాసుకొచ్చింది.  ఇక దీంతో  పవన్ ఫ్యాన్స్ మళ్లీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సైలెంట్ గా  ఉన్నావ్ కదా.. మళ్లీ కెలుక్కోవడం అవసరమా అక్కా అని కొందరు. లాస్ట్ టైమ్ జరిగింది సరిపోలేదా.. ఇంకా కావాలేమో అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Tv Kissik Talk Show : అవసరానికి వాడుకొని వదిలేశారు..లవ్ స్టోరీ గురించి నిజాలు చెప్పిన రైతుబిడ్డ..

Big Stories

×