Vishal: విశాల్ రెడ్డి.. చెన్నైలో ఉన్నాడు.. తమిళ్ సినిమాలు చేస్తున్నాడు అని తమిళ్ తంబీ అనుకోవద్దు. విశాల్ అచ్చతెలుగు అబ్బాయి. వాళ్ళ కుటుంబం చెన్నైలో స్థిరపడడంతో విశాల్.. అక్కడే తన కెరీర్ ను మొదలుపెట్టి తమిళ్ హీరోగా మారాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకున్నా.. అతనిని హీరోగా నిలబెట్టిన సినిమా మాత్రం పందెం కోడి. ఈ సినిమా తరువాత విశాల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పొగరు, భరణి, సెల్యూట్, వాడు వీడు, డిటెక్టీవ్ , ఎనిమీ, లాఠీ, మార్క్ ఆంటోని లాంటి సినిమాలతో తెలుగులో కూడా విశాల్ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయంగా కూడా విశాల్ తెలుగువారికి బాగానే దగ్గరయ్యాడు. గతేడాది ఎన్నికల సమయంలో జగన్ గెలవాలని ఆయన కోరుకున్నాడు. ఇక ఇలా ప్రతి దాంట్లో విశాల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటూ వచ్చాడు.
Good Bad Ugly: ప్రభాస్ తో పోటీకి రెడీ అయిన అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ ఎప్పుడంటే.. ?
ఇక మార్క్ ఆంటోని సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ లో కనిపించే విశాల్ గత కొన్ని నెలల నుంచి మీడియాకు దూరంగా ఉన్నాడు. ఇక తాజాగా విశాల్ నటించిన మదగజరాజు సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు నోచుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కు వచ్చిన విశాల్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
అసలు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. జుట్టు మొత్తం పోయి, బక్కచిక్కి, మైక్ ను కూడా పట్టుకోలేక చేతులు వణుకుతూ.. ఎంతో అనారోగ్యంతో ఉన్నట్లు కనిపించాడు. విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలు చూసిన అభిమానులు 47 ఏళ్ల వయస్సులో విశాల్ కు ఇలాంటి కష్టం వచ్చింది. అసలు అతని ఆరోగ్యానికి ఏమైంది.. ? ఎందుకు అలా మారిపోయాడు.. ? అని భయాందోళనలకు గురవుతున్నారు.
Rajinikanth : ఇదేందయ్యా ఇది..గుడి కట్టి పూజలు కూడా.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
ఇక అభిమానుల భయాందోళనలను గమనించిన వైద్యులు.. విశాల్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు. విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాల్ కు బెడ్ రెస్ట్ కావాలని చెప్పుకొచ్చారు. “ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాం.విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది” అంటూ ప్రకటన విడుదల చేశారు.
ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకోపక్క వైరల్ ఫీవర్ వలనే విశాల్ ఇలా మారాడా .. ? లేక ఇంకేదైనా సమస్యతో బాధపడుతున్నాడా .. ? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి విశాల్ త్వరగా కోలుకొని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడో చూడాలి.