Andrea Jeremiah: తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఘోస్ట్ సినిమాలలో నటించి, భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తూ.. భారీ పాపులారిటీ అందుకుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలకు దూరమైంది. పోనీ పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరం అయ్యిందా..?అంటే అదీ లేదు. పోనీ అవకాశాలు రావడం లేదా? అంటే, మంచి పీక్స్ లో ఉన్నప్పుడే దూరం అవ్వడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి అనుమానాలలో ఈమెకు లవ్ బ్రేకప్ జరిగి, డిప్రెషన్ లోకి వెళ్లిందనే వార్త కూడా వినిపించింది. ఇకపోతే తాజాగా ఇన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఎందుకు తీసుకుంది అనే విషయంపై ఎప్పుడూ కూడా నోరు ఇవ్వలేదు ఆండ్రియా.
కానీ ఈ మధ్య తనపై నెగెటివిటీ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు తమ జీవితంలో సంతోషం కలిగినా.. దుఃఖం ఎదురైనా ఏది జరిగినా సరే అభిమానులతో పంచుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య సమస్యలను కూడా పంచుకుంటున్నారు. సమంత ఎలాగైతే తనకు మయోసైటిస్ వ్యాధి వచ్చింది అని తెలిపిందో, ఇప్పుడు ఈమె కూడా అలాగే తన వ్యాధి గురించి బయట పెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా మాట్లాడుతూ..” ‘వడ చెన్నై’ సినిమా తర్వాత ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ వచ్చింది. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారిపోయాయి. రోజు నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపించేవి. రక్త పరీక్షలో కూడా వ్యాధిని గుర్తించలేదు. ఇకపోతే ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడి అంటూ ఆమె తెలిపింది. అనారోగ్యంతో బాధపడడం వల్లే సినిమాలకు దూరంగా ఉన్నాను. కానీ నేను బ్రేక్ తీసుకోవడంతో నాకు లవ్ బ్రేకప్ జరిగి. డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటూ వార్తలు ఇష్టం వచ్చినట్లు రాశారు. ఇకపోతే ఈ వ్యాధికి సంబంధించిన అనేక మచ్చలు ఇప్పటికి శరీరంపై ఉన్నాయని, ఇంకా కనురెప్పలు తెల్లగానే ఉన్నాయని, ఈ వ్యాధి నయం చేసుకోవడానికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ సహాయపడుతోంది” అంటూ తెలిపింది. ఇకపోతే శరీరం మొత్తం మచ్చలు కారణంగా స్క్రీన్ ముందుకు రాలేకపోతున్నాను అంటూ తన బాధను వెల్లడించింది ఆండ్రియా. ఇక ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అయితే మొత్తానికి ఈ విషయం తెలిసి అభిమానులు ఆండ్రియా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఆండ్రియా కెరియర్..
‘అన్నయమ్ రసూల్’ అనే సినిమా ద్వారా మలయాళీ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆండ్రియా లోహం, లండన్ బ్రిడ్జి వంటి చిత్రాలలో నటించింది. ముఖ్యంగా బైలింగ్వల్ మూవీ ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత ‘తడాఖా’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది.