Chiranjeevi – Anil Ravipudi: అనిల్ రావిపూడి (Anil Ravipudi)వరుస సక్సెస్ తో డైరెక్టర్ రాజమౌళి (Rajamouli )సరసన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈయన ఇప్పటివరకు 8 సినిమాలు తీస్తే.. ఆ 8 సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్సే..ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అలా హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చిరంజీవి సినిమా గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవితో చేయబోయే సినిమా గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్లు చేశారు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని కూడా తెలియజేశారు.
చిరంజీవి మూవీకి అనిల్ రావిపూడి భారీ డిమాండ్..
అయితే లైలా మూవీ(Laila Movie)తో భారీ డిజాస్టర్ ని చవిచూసిన నిర్మాత సాహు గారపాటి (Sahoo Garapati) తన ఆశలన్నీ అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా పైనే పెట్టుకున్నారు.అయితే ఇప్పటికే ఈ సినిమా గురించి పలు రూమర్లు నెట్టింట్లో వినిపిస్తున్న వేళ తాజాగా అనిల్ రావిపూడి రెమ్యూనరేషన్ గురించి మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి ఇంతకీ అనిల్ రావిపూడి, చిరంజీవి మూవీకి ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో సినిమా వస్తోంది అంటే మెగా ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే ఇప్పటికే తనతో చేసిన ప్రతి ఒక్క హీరో సినిమాలో కామెడీ జానర్ ని టచ్ చేశారు డైరెక్టర్.ఇక మెగాస్టార్ కామెడీని చూసి చాలా రోజులైంది. కాబట్టి అనిల్ రావిపూడి సినిమాలో కచ్చితంగా మెగాస్టార్ తో కామెడీ సీన్స్ పెడతారని తెలుస్తోంది.
డైరెక్టర్ డిమాండ్ కి ఒప్పుకున్న నిర్మాత..
ఇక చిరంజీవితో చేయబోయే సినిమాకి అనిల్ రావిపూడి ఏకంగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు సినిమా హిట్ అయి లాభాలు వస్తే లాభాల్లో వాటాలు కూడా ఇవ్వమంటున్నారట. అయితే డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టుకున్న నిర్మాత.. డైరెక్టర్ అనిల్ రావిపూడి అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అనిల్ రావిపూడి రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక రెమ్యూనరేషన్ పై రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి.. అనిల్ రావిపూడి కాంబో కాబట్టి బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల కలెక్షన్స్ పక్కా అంటూ అభిమానులు కూడా కామెంట్స్ పెడుతున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ గుర్తింపు..
ఈ ఏడాది వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary) జంటగా వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రాంతీయ చిత్రంగా విడుదలై సరికొత్త కలెక్షన్లు రాబట్టింది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అంటే ఇక ప్రాంతీయంగా ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో చెప్పాల్సిన పనిలేదు.