BigTV English

TDP vs YCP: మిర్చి ఘాటుకు.. హీటెక్కిన పొలిటికల్.. లైన్ దాటేసిన విమర్శలు..

TDP vs YCP: మిర్చి ఘాటుకు.. హీటెక్కిన పొలిటికల్.. లైన్ దాటేసిన విమర్శలు..

TDP vs YCP: మిర్చి ఘాటు మనకు తెలియంది కాదు. అదే ఎండు మిర్చి ఘాటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ ఘాటును తట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం ఈ ఘాటు కారణంగానే ఏపీ రాజకీయం హీటెక్కింది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య మరీ ఘాటెక్కిన కామెంట్స్ సాగుతుండగా, ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.


ఏపీలో మిర్చి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు పంట అధిక దిగుబడి వచ్చిన ఆనందం కూడా లేదని, మద్దతు ధర లేక ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గుంటూరు మిర్చి యార్డు వద్ద మిర్చికి కనీస మద్దతు ధర లేక రైతులు ఆందోళన బాట పట్టారు. ఇపప్టికే సీఎం చంద్రబాబు కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రిని ఇదే విషయంపై కలవనున్నారు.

ఇలాంటి సమయంలో మాజీ సీఎం జగన్ బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. మిర్చి రైతులకు అండగా నిలిచేందుకు వెళ్లిన జగన్, అక్కడి రైతులతో మాట్లాడారు. అయితే ఘాటు దెబ్బకు పట్టుమని పది నిమిషాల్లో జగన్ బయటకు వచ్చారని స్థానికులు తెలుపుతున్నారు. అక్కడ మీడియా సమావేశం నిర్వహించిన జగన్.. ఏపీలో రైతులు బతికే పరిస్థితులు లేవని, ఏ పంటకు కూడా మద్దతు ధర లభించడం లేదన్నారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయే రోజుల్లో రైతు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.


అలా జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే, మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు మద్దతు ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన రూ. 1600 కోట్లను తాము చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పటికే కేంద్రంతో ప్రభుత్వం మాట్లాడుతుందని, జగన్ తన రాజకీయ స్వలాభం కోసం రైతు మాట లేవనెత్తినట్లు విమర్శించారు. రైతుకు అధిక మేలు చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించినా, ఇంకా మార్పు రాకపోవడం శోచనీయమని మంత్రి అన్నారు.

Also Read: Free Fire Game – Eluru: ఆన్‌లైన్ గేమ్ వివాదం.. చితకొట్టుకున్న విద్యార్థులు, చివరికి..

ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇలా ఏపీ రాజకీయం ఒక్కసారిగా మిర్చి వైపు మళ్లిందని చెప్పవచ్చు. కాగా మిర్చి ఘాటు ఏమో కానీ, ఈ ఘాటు లక్ష్యంగా ఏపీ పొలిటికల్ హీటెక్కిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిన్న వంశీ అరెస్ట్ పై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య మాటల యుద్దం సాగగా, నేడు మిర్చి మద్దతు ధర లక్ష్యంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. రైతులకు పెండింగ్ లో ఉంచిన డబ్బులను తాము చెల్లించమని కూటమి అంటుండగా, ఏపీ రైతులను కూటమి మరచిపోయిందని వైసీపీ విమర్శిస్తోంది. రైతులు మాత్రం తమకు న్యాయం చేయాలన్న డిమాండ్ ను వినిపిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×