Anil Ravipudi Remuneration : 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో కామెడీ సినిమాలకు కేరాఫ్ అయిన అనిల్ రావిపూడి కూడా ఒకరు అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు. రీసెంట్‌గా వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు… సీనియర్ హీరో వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ టైం 300 కోట్ల మార్క్ అందుకునేలా చేశాడు. అలాగే గేమ్ ఛేంజర్‌తో పీకల్లోతు నష్టాల్లో ఉన్న నిర్మాత దిల్ రాజుకు ఓ హోప్ చూపించాడు. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.
ఆ.. డిమాండ్ నుంచి వచ్చిందే… ఈ MEGA 157. సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయిన వెంటనే… ఈ ప్రాజెక్ట్ పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల స్క్రిప్ట్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేశాడు. ఉగాది రోజు రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీ కూడా స్టార్ట్ అయింది. దీనికి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
ఈ రోజు గ్యాంగ్ ఆఫ్ MEGA 157 అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి సినిమాలో భాగం కాబోతున్న క్రూ అందరినీ పరిచయం చేశాడు. అలాగే… వచ్చే సంక్రాంతికి రాబోయే ఈ సినిమా సినిమా ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. ఇలా సినిమాపై ఇప్పటి నుంచే బజ్ పెరిగేలా… అనిల్ రావిపూడి చూస్తున్నాడు.
రెమ్యునరేషన్ ఎంతంటే…?
ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ MEGA 157 మూవీకి అనిల్ రావిపూడి తీసుకున్న రెమ్యునరేషన్ పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డైరెక్టర్లు అందరూ రెమ్యునరేషన్ తీసుకుంటారు. దానికి చర్చ అవసరం లేదు. కానీ, భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు.. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన లాభాల్లో కూడా వాట తీసుకుంటున్నాడట.
ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే… అనిల్ రావిపూడి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. దీంతో పాటు లాభాల్లో వాటాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి ఎంతంటే..?
ఇప్పుడు ఈ MEGA 157 కి 20 కోట్లతో పాటు లాభాల్లో వాటాలు తీసుకుంటుండగా… గత చిత్రం అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీకి దాదాపు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఫస్ట్ మూవీకి పారితోషికం ఎంతో తెలుసా..?
ఇప్పుడు ఒక్క సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం తీసుకునే అనిల్ రావిపూడి… కెరీర్ ప్రారంభంలో 10 ఏళ్ల క్రితం వచ్చిన పటాస్ మూవీకి కేవలం 50 లక్షల లోపే రెమ్యునరేషన్ తీసుకున్నారట. అక్కడి నుంచి క్రమంగా ఎదుగుతూ… ఈ స్థాయికి వచ్చాడు.