BigTV English
Advertisement

Anil Ravipudi : నాకు ఆ దర్శకుడులా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఉండలేను

Anil Ravipudi : నాకు ఆ దర్శకుడులా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఉండలేను

Anil Ravipudi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి అని చెప్పాలి. అవును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకోలేదు. అనిల్ రావిపూడి సినిమా అంటేనే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా టైంపాస్ అయిపోతుంది అని చాలామందికి ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. ఒక మామూలు కాన్సెప్ట్ తో, కథతో బాక్స్ ఆఫీస్ వద్ద నవ్వులు పువ్వులు పూయించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాడు అనిల్. ఇక ప్రస్తుతం చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం అనిల్ రావిపూడి కి దక్కింది అని చెప్పాలి. అదే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం. అనిల్ మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా సంక్రాంతి కానుక విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిలోని మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని అనిల్ ఎలా చూపిస్తాడో అని చాలామందికి ఒక క్యూరియాసిటీ కూడా ఉంది.


రియల్ లైఫ్ లో అలా ఉండాలి

ప్రతి దర్శకుడు కు తమ అభిమాన దర్శకులు కూడా ఉంటారు. అలా అనిల్ రావిపూడి విషయానికొస్తే చాలామంది అభిమాన దర్శకులు ఉన్నారు. కానీ నిజజీవితంలో అనీల్ రావిపూడి సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి అని అనుకుంటున్నారట. సందీప్ రెడ్డి వంగ ఎంత తెలివిగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సూటిగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతాడు. సందీప్ వంగా మాట్లాడే మాటలు చాలామందికి విపరీతంగా కనెక్ట్ అవుతాయి. సందీప్ రెడ్డి వంగాను ఎవరు ఏమీ అనలేరు, ఒకవేళ అని నా కూడా అవతల వాళ్ళకి కౌంటర్ అటాచ్ చేయకుండా ఉండేటట్టు సందీప్ గా మాట్లాడుతాడు. నిజ జీవితంలో నేను కూడా అలానే ఉండాలి అనుకుంటాను. కానీ నా వల్ల అలా కావట్లేదు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.


సందీప్ వంగ స్టైల్

ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. కబీర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు ఒక రిపోర్టర్ సందీప్ రెడ్డి వంగాను ప్రశ్న అడిగాడు. సందీప్ రెడ్డి వంగా దానికి సమాధానం చెబుతుంటే ఆ రిపోర్టర్ వినట్లేదు. వెంటనే నువ్వు క్వశ్చన్ అడిగావు నా సమాధానం వినట్లేదు, అని చెప్పి అందరి ముందు అతని తిరిగి క్వశ్చన్ చేశాడు సందీప్ వంగా. అంతేకాకుండా చాలా ఇంటర్వ్యూస్ లో సందీప్ రెడ్డి వంగ మాట్లాడే విధానం అవతల వాళ్ళకి గట్టిగా తగులుతుంది. అలానే తనను తన సినిమాను కామెంట్ చేసిన చాలామంది జర్నలిస్టుకు తన సక్సెస్ తో సమాధానమిచ్చాడు సందీప్ రెడ్డి వంగ.

Also Read : Prashanth Neel: రాజమౌళి ను డిసప్పాయింట్ చేసిన ప్రశాంత్ నీల్, డ్రాగన్ ఏం చేస్తాడో.?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×