BigTV English

Prashanth Neel: రాజమౌళి ను డిసప్పాయింట్ చేసిన ప్రశాంత్ నీల్, డ్రాగన్ ఏం చేస్తాడో.?

Prashanth Neel: రాజమౌళి ను డిసప్పాయింట్ చేసిన ప్రశాంత్ నీల్, డ్రాగన్ ఏం చేస్తాడో.?

Prashanth Neel: ప్రస్తుతం సినిమాలు చేస్తున్న స్టార్ డైరెక్టర్స్ అంతా కూడా ఒకప్పుడు ప్రేక్షకులే. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు అందరికీ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఇష్టాలు ఉంటాయి. అలానే ప్రతి దర్శకుడు కి ఒక సొంత శైలి ఉంటుంది. అలానే ప్రతి దర్శకుడికి అభిమాన దర్శకులు కూడా ఉండరు. అలానే అభిమాన హీరోలు,హీరోయిన్లు కూడా ఉంటారు. ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విషయానికొస్తే చాలామంది సినిమాలకు తను అభిమానిగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని సినిమాల గురించి ఆయన మాట్లాడే తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ సినిమాల గురించి రాజమౌళి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. చాలామంది హీరోలకి ఒక యూనిట్ స్టైల్ ను పూరి జగన్నాథ్ ఇచ్చారు అంటూ ఒక వేదికపై చెప్పుకొచ్చారు.


శృతిహాసన్ డాన్స్ ఇష్టం

ఎస్ఎస్ రాజమౌళికి శృతిహాసన్ డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమని ఒక సందర్భంలో చెప్పారు. రేసుగుర్రం సినిమాలోని పార్టీ సాంగ్, శ్రీమంతుడు సినిమాలోని చారుశీల పాట. ఈ రెండు పాటలు ఎస్.ఎస్.రాజమౌళికి విపరీతమైన ఇష్టం అంట. ఈ రెండు పాటల్లో శృతిహాసన్ చేసిన డాన్స్ అద్భుతంగా ఉంటుందని జక్కన్న చెబుతుంటారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సలార్. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమాలో డ్యూయెట్ సాంగ్ ఉంటుంది అని ఎస్ఎస్ రాజమౌళి ఎక్స్పెక్ట్ చేశారట. సినిమా రిలీజ్ కంటే ముందే అటువంటి సాంగ్స్ ఏమీ లేవు అని చెప్పి ప్రశాంత్ నీల్ దర్శక ధీరుడు రాజమౌళిని డిసప్పాయింట్ చేశాడు.


డ్రాగన్ తో ఏం చేస్తాడో

ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ ని డ్రాగన్ అనే ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తే వచ్చాయి తప్ప అధికారికంగా ప్రకటించలేదు. అయితే రీసెంట్ గా రాజమౌళి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో ఇదే టైటిల్ అని అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇకపోతే ఈ సినిమా గురించి రాజమౌళి ఎదురు చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్ట్రెంత్ ఏంటో ఎస్.ఎస్.రాజమౌళికి బాగా తెలుసు. దానిని ప్రశాంత్ నీల్ ఎలా ప్రజెంట్ చేస్తాడో అనే క్యూరియాసిటీ ఖచ్చితంగా రాజమౌళి కు ఉంటుంది. మరి ఈసారి డిసప్పాయింట్ చేస్తాడా, రాజమౌళిని సాటిస్ఫై చేస్తాడు అనేది కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.

Also Read : Sarangapani jathakam: నచ్చితేనే చూడండి.. నాని బాటలో ప్రియదర్శి.. వర్కౌట్ అయ్యేనా..?

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×