BigTV English

Anil Ravipudi : రాజేంద్రుడిని పక్కన పెట్టిన అనిల్ రావిపూడి.. బాలకృష్ణే వద్దన్నాడా..?

Anil Ravipudi : రాజేంద్రుడిని పక్కన పెట్టిన అనిల్ రావిపూడి.. బాలకృష్ణే వద్దన్నాడా..?
Anil Ravipudi

Anil Ravipudi : అనిల్ రావిపూడి, రాజేంద్ర ప్రసాద్ మధ్య మంచి రిలేషన్ ఉంది. పైగా.. రావిపూడి తీసే సినిమాల్లో కామెడీ కంపల్సరీ. తన టైమింగ్‌కు మ్యాచ్ చేయగల నటుడు కచ్చితంగా రాజేంద్ర ప్రసాదే. అందులో డౌట్ లేదు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ ఉన్నా సరే… రాజేంద్ర ప్రసాద్ ఇరగదీసేస్తాడు. అసలు సినీ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ ఎవరంటే రాజేంద్రప్రసాదే. అందుకే, దాదాపుగా అన్ని సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్‌ను తీసుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే నటకిరీటి ఉండి తీరాల్సిందే అన్నంతగా పేరొచ్చేసింది టాలీవుడ్‌లో.


సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో రాజేంద్రునికి గట్టి క్యారెక్టర్సే ఇచ్చాడు. ఇక గాలి సంపత్ సినిమాకు స్టోరీ రాసి పెట్టి, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. నటకిరీటి అంటే అనిల్ రావిపూడికి అంత అభిమానం. చాలా సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో రాజేంద్ర ప్రసాద్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు కూడా. ఇకపై రావిపూడి చేసే ప్రతి సినిమాలోనూ రాజేంద్ర ప్రసాద్‌కి కచ్చితంగా ఓ క్యారెక్టర్ ఉంటుందన్న టాక్ బలంగా నాటుకుపోయింది ఇండస్ట్రీలో. అలాంటిది బాలకృష్ణ సినిమాలో మాత్రం రాజేంద్రునికి ఛాన్స్ ఇవ్వలేదట.

బయట నడుస్తున్న టాక్ ఏంటంటే బాలయ్య బాబే.. రాజేంద్ర ప్రసాద్ స్థానంలో మరొకరిని తీసుకోండని సలహా ఇచ్చాడట. రాజేంద్ర ప్రసాద్‌పై అంత కోపం ఎందుకో అంతుబట్టడం లేదంటున్నారు. నిమ్మకూరులో పుట్టిన రాజేంద్ర ప్రసాద్‌కి నందమూరి తారక రామారావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నప్పుడు తరచూ నిమ్మకూరులోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే రాజేంద్ర ప్రసాద్‌పై ఎన్టీఆర్ ప్రభావం పడింది. ఎన్టీఆర్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తోనే సినిమాల్లో అడుగుపెట్టాడు. అలాంటిది.. రాజేంద్ర ప్రసాద్‌తో కచ్చితంగా నందమూరి బాలకృష్ణకు మంచి అనుబంధం ఉండి ఉండాలి. కాని, అలా కనిపించడం లేదంటున్నారు.


అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లేడు అని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ బదులు ఇంకో నటుడిని పెట్టుకోమని రావిపూడికి నందమూరి బాలకృష్ణ సలహా ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాలో నటించాలని రాజేంద్ర ప్రసాద్ ని అనిల్ రావిపూడి కోరడం, ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. కాని, చివరి నిముషంలో రాజేంద్ర ప్రసాద్ బదులు వేరే నటుడిని ఆ పాత్రకి ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ ని ఎందుకు వద్దన్నాడనేది అంతుబట్టడం లేదంటున్నారు. అసలు ఈ వార్తలో ఎంత నిజం ఉందో కూడా తెలీదు. ఒట్టి గాసిప్ అనేవాళ్లూ ఉన్నారు. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×