Pawan Kalyan..సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య, ఇద్దరు హీరోయిన్ల అభిమానుల మధ్య వార్ జరగడం అనేది కొత్తగా జరుగుతోంది కాదు. చాలా రోజుల నుండి ఇది మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఒక హీరో అభిమాని మరో హీరో పై ట్రోల్ చేయడం, ఆ హీరో అభిమాని దానికి ధీటుగా కౌంటర్ ఇవ్వడం అనేది చూస్తూ వస్తున్నాం. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్,అక్కినేని ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ హీరోల అభిమానుల మధ్యే ప్రధానంగా సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు అందరూ చాలా బాగా కలిసిపోయి ఉంటారు. కానీ అభిమానులు మాత్రం హీరోల మధ్య చిచ్చులు పుట్టిస్తూనే ఉంటారు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా మహేష్ బాబు(Maheshbabu ) ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పేరుపై ట్రోల్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పేరు పై తల్లి అంజనాదేవి కామెంట్..
మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లీ అంజనా దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవిని యాంకర్ ప్రశ్నిస్తూ.. “పవన్ కళ్యాణ్ కి అన్నప్రాసన రోజే పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టారా.. ?అని అడిగితే.. లేదు మొదట కళ్యాణ్ కుమార్ అని పెట్టాము. కానీ ఆ తర్వాత ఎవరో పవన్ అని పెట్టారట.. నాకు తెలియదు ” అని అంజనాదేవి చెప్పింది.
అది మహేష్ ఫ్యాన్స్ పనే..
అయితే ఈ వీడియోని మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ పై ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని అందరూ కళ్యాణ్ బాబు అని పిలుస్తూ ఉంటారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్..” నీ పేరు కళ్యాణ్ కుమార్ అంట కదా.. నీకు ఈ బాబు అనే పేరు ఎక్కడి నుండి వచ్చిందిరా.. మా హీరో ట్యాగ్ మీద నీ హక్కు ఏంటిరా? అంటూ సోషల్ మీడియాలో ఓ మహేష్ బాబు అభిమాని పవన్ కళ్యాణ్ తల్లి మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ ఇచ్చారు.
Also read: Raja Saab: యూనిట్ కి దెబ్బ మీద దెబ్బ.. మరో ఫోటో లీక్.. ఆ లుక్ చూసారా?
సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్స్ వార్..
అయితే మహేష్ బాబు అనే పేరు చివరన బాబు అని ఉంటుంది.కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పవన్ కళ్యాణ్ ని కూడా కళ్యాణ్ బాబు అని పిలుస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ నీ పేరు కళ్యాణ్ కుమార్, పవన్ కళ్యాణ్ అయితే మా హీరో పేరులోని బాబు అని ఎందుకు పెట్టుకున్నావురా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వీడియో వైరల్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దానిపై ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది.
Nee Peru Kalyan Kumar anta gaa
Neeku ee Babu ekkada nundi vachindi ra
Maa hero tag meeda nee obsession enti raa pic.twitter.com/2S6tazDspa https://t.co/PTwVsoWFWG— VINAY PRINCE (@iam_VinayPrince) June 1, 2025