Simbu : హీరో శింబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో శింబు చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉండేది. చాలామందికి శింబు సినిమాలుపై మంచి అంచనాలు ఉండేవి. ఆయన ఎన్నుకున్న కాన్సెప్ట్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందుకే ఇప్పటికి శింబు కు మంచి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. వల్లభ సినిమా ఇప్పటికీ చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిం. అలానే మన్మధ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలన్నీ కూడా యూత్ ను విపరీతంగా ఆకర్షించాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన విన్నాయ తాండ వరువాయ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను తెలుగులో ఏ మాయ చేసావే పేరుతో నాగచైతన్య హీరోగా తీశాడు గౌతం. ఈ రెండు సినిమాలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
రీమేక్ చేయకపోవడం శింబు కి కలిసి వచ్చింది
శింబు నటించిన మన్మధ సినిమా ఒక సెన్సేషన్. అప్పట్లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని చాలామంది తో ప్లాన్ చేశాడు. కానీ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండటం వలన ఈ పాత్రకు పెద్దగా ఎవరూ ఒప్పుకోలేదు. అయితే ఆఖరికి ఈ సినిమాను ఒక 30 లక్షల వరకు ఖర్చు పెట్టి డబ్బింగ్ చేసి తెలుగులో విడిచిపెట్టారు. ఈ సినిమా విడుదలైన తర్వాత చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఒక థియేటర్ స్టాఫ్ ఈ సినిమా విపరీతంగా నచ్చటం వలన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక బ్యానర్ పెట్టి అక్కడ ఒక లైట్ కూడా ఏర్పాటుచేశాడు. ఇక్కడితో శింబుకి తెలుగులో కూడా గుర్తింపు రావడం మొదలైంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు పాటలకు పైగా పాడాడు. తెలుగు ప్రేక్షకులకి ఇప్పుడు తన గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
థగ్ లైఫ్ లో కీలక పాత్ర
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ స్క్రిప్ట్ లో ఓల్డ్ ఐడియా ఒకటి మణిరత్నం కి విపరీతంగా నచ్చిందట. అయితే కమల్ హాసన్ ఇచ్చిన ఆ ఓల్డ్ ఐడియాతో మణిరత్నం ఒక కొత్త స్క్రిప్టును తయారు చేశాడట. కమల్ హాసన్ ఐడియాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మణిరత్నం తన సొంత రూట్ లో కథను తయారు చేశారు. ఈ సినిమాలో శింబు ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నారు అని అధికారికంగా ప్రకటించిన తరువాత కొన్ని కారణాల వలన దుల్కర్ తప్పిపోవలసి వచ్చింది. ఈ సినిమా జూన్ 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
Also Read: SVKrishnaReddy Bday Celebrations : ఆ భాష ఏంటి రాజేంద్రప్రసాద్, ఉన్న పేరు పోగొట్టుకోవడానికేనా.?