BigTV English

OTT Movie : ఆటోలో అమ్మాయిలను అనుభవించి చంపే సైకో… ఫ్యామిలీతో ఈ సినిమాను చూస్తే అంతే సంగతులు

OTT Movie : ఆటోలో అమ్మాయిలను అనుభవించి చంపే సైకో… ఫ్యామిలీతో ఈ సినిమాను చూస్తే అంతే సంగతులు

OTT Movie : ఓటిటిలో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు కూడా పోటాపోటీగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. అయితే వీటిలో రియల్ లైఫ్ స్టోరీలతో కొన్ని సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఓటిటిలో ఇటువంటి వెబ్ సిరీస్ లు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ లో ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఈ క్రమంలో స్టోరీ థ్రిల్లింగ్ ట్విస్టులతో నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రిమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


స్టోరీలోకి వెళితే

చెన్నైలో శంకర్ అనే వ్యక్తి మొదట్లో ఆటో డ్రైవర్ జీవితాన్ని గడుపుతుంటాడు. ఆ తరువాత అతను చట్టవిరుద్ధమైన పనులు చేయడం ప్రారంభిస్తాడు.మద్యం రవాణా చేయడం, అమ్మాయిలను వ్యభిచారంలోకి దించడం వంటివి మొదలు పెడతాడు. అమ్మాయిలను ఆటోలోనే క్రూరంగా అనుభవించి చంపేవాడు శంకర్. క్రమంగా ఇతను నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు. శంకర్ చిన్న స్థాయి స్మగ్లర్‌గా ప్రారంభించి, క్రమంగా చెన్నైలోని అక్రమ వ్యాపారాలను తన నియంత్రణలోకి తీసుకుంటాడు. అతను వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు. కానీ అతని అహంకారం, అతని ప్రవర్తన కారణంగా సమస్యలు అతన్ని వెంటాడుతాయి. శంకర్ కి సుమతి అనే భార్య ఉంటుంది. అయినా కూడా చంద్రిక అనే ఒక డాన్సర్ తో సంబంధం పెట్టుకుంటాడు శంకర్. ఇది అతని వ్యక్తిగత, నేర జీవితంలో సంఘర్షణలకు దారితీస్తుంది.


అక్రమ వ్యాపారంలో ఇతనికి శత్రువులు కూడా పెరిగిపోతారు. శంకర్ కి వెన్నుపోటు పొడవాలని చూస్తుంటారు కొంతమంది గ్యాంగ్ స్టర్స్. ఈ క్రమమల  శంకర్ తనకు ద్రోహం చేసిన వారిని క్రూరంగా హత్య చేస్తాడు. 1988 నాటికి శంకర్ బంగళాలు, కార్లతో శక్తివంతమైన వ్యక్తిగా పేరు సంపాదిస్తాడు. అయితే అతడు చేసిన హత్యలు పోలీసుల దృష్టిలో పడతాయి. శంకర్ హత్యచేసిన సంపత్ అనే గ్యాంగ్ స్టర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శంకర్ అరెస్టు అవుతాడు. చివరికి శంకర్ కి శిక్ష పడుతుందా ? అతడు ఈ కేసునుంచి తప్పించుకుంటాడా ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : జాబ్ పేరుతో పేద అమ్మాయితో పాడు పనులు… చివరికి వాడికి పట్టే గతి చూస్తే మతి పోవాల్సిందే

జీ 5 (ZEE5 ) లో స్ట్రీమింగ్ 

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఆటో శంకర్’ (Auto Shankar). ఇది 1985 నుండి 1995 వరకు చెన్నైలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్ గౌరీ శంకర్ అలియాస్ ‘ఆటో శంకర్’ అనే క్రిమినల్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఇందులో శంకర్ పాత్రలో అప్పని శరత్ నటించారు. ఈ సిరీస్ 2019 లో 10 ఎపిసోడ్స్ తో, జీ 5 (ZEE5 ) ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×