BigTV English

First Indian Movie in Hollywood remake: దృశ్యం చిత్రానికి మరో ఘనత.. హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి భారతీయ సినిమా..

First Indian Movie in Hollywood remake: దృశ్యం చిత్రానికి మరో ఘనత.. హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి భారతీయ సినిమా..

Another Credit of the Movie Drushyam


Another Credit of the Movie Drushyam: థ్రిల్లర్ ఫ్రాంచైజీగా తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’. ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ‘దృశ్యం’ సినిమా తాజాగా మరో ఘనత సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుసోంది. ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం. భారతీయ సినిమాల్లో హాలీవుడ్‌కి రీమేక్‌ కానున్న మొదటి చిత్రంగా ‘దృశ్యం’ నిలిచింది.

మొదట ఈ సినిమా మలయాళంలో తెరకెక్కించారు. ఆ తరువాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో వివిధ పేర్లతో వచ్చి సత్తా చాటింది. దానికి సీక్కెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ కూడా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం కొరియాన్‌లో రీమేక్‌ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించింది.


ఇండియా నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. దృశ్యం లాంటి మంచి కథనం విశ్వవ్యాప్త ఆకర్షణను కలిగి ఉంది. అందుకు ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలని ఆసక్తిగా ఉందన్నారు.

Read More: పోలీసు పాత్రలపై వివాదాస్పద వ్యాఖ్యలు .. క్షమాపణలు చెప్పిన నాగబాబు..

హాలీవుడ్ కోసం ఆంగ్లంలో ఈ కథను రూపొందించడానికి గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్‌తోపాటు మరో సంస్థతో కలిసి పని చేయడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. కొరియా, హాలీవుడ్ తర్వాత.. రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో 10 దేశాల్లో దృశ్యం నిర్మించడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.

దృశ్యం-2 నిర్మాత అభిషేక్ పాఠక్‌ మాట్లాడుతూ.. దృశ్యం సినిమాకి ఇంత భారీ విజయాన్ని అందించిన భారతీయ ప్రేక్షకులపై అపారమైన ప్రేమ ఉంది. దృశ్యం లాంటి కథను ప్రపంచవ్యప్తంగా ప్రేక్షకులు ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ హాలీవుడ్‌ మార్కెట్‌కు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×