Big Stories

Dharani Portal: ధరణి ధరఖాస్తులకు మోక్షం..! మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్..

Dharani portal latest updates

- Advertisement -

Dharani portal latest updates(TS today news): తెలంగాణలో ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు,సీసీఎల్ఏ అధికారులను బదలాయించింది. అయితే ఏ స్థాయి వారికి ఎలాంటి మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. మార్చి ఒకటి నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 24వ తారీఖున ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన రివ్యూలో ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

మండలాల్లోనే అధికారులు దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ధరణి పోర్టల్ లో సవరింపు కోసం 2,45,037 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి. 17 రకాల మాడ్యూల్స్ సవరణకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 2.45 లక్షలుగా ఉంది. రికార్డుల అప్ డేషన్ పేరుతో నిషేధిత జాబతా పార్ట్ -బీలో 13 లక్షల ఎకరాలు ఉన్నాయి. కారణాలు లేకుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని పరిష్కరించేందుకు సిద్దమతున్నారు.

భూరికార్డుల నిర్వహణకు గత ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ నిర్వహణ సర్వ అధికారాలను కూడా కట్టబెట్టింది. దీని ఫలితంగా చాలా దరఖాస్తులు పెండింగ్ లోనే ఉండిపోయాయి. దీని ద్వారా చాలా మంది భూహక్కుదారులు, తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ప్రధానంగా ప్రస్తావించింది. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేసి భూ మాతగా మారుస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో ఉండడంతో ధరణి పోర్టల్ సమస్యలపై దృష్టి పెట్టింది. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఏర్పాటైనా కమిటీ నుంచి మద్యంతర నివేదికను తీసుకున్న సర్కార్.. తక్షణమే చేయాల్సిన మార్పులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. చిన్నచిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చూస్తోంది ప్రభుత్వం.

Read More: హైదరాబాద్ లో ఆర్టీసీని మహిళలు తెగ వాడేస్తున్నారు.. 8 కోట్లకు చేరిన జీరో టికెట్లు..!

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కన్వీనర్ గా భూ పరిపాలన ప్రధాన కమీషనర్ నవీన్ మిత్తల్ వ్యవహరిస్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాద్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణులు మా భూమి సునీల్, విశ్రాంతి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, బి మధుసూదన్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ధరణి పోర్టల్ సమస్యలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

అసలు ధరణి అంటే ఏమిటంటే..? 

కాగితాల నుంచి కంప్యూటర్లకు ఎక్కిన భూమి/ రెవెన్యూ రికార్డులే ధరణి. అప్పటి 1బి రికార్డే ఇప్పుడున్న ధరణి. 80వ దశకంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సి.ఎల్.ఆర్, ఆ తర్వాత ఎన్.ఎం.పి, ఇప్పుడు అమలులో ఉన్న డి.ఐ.ఎల్.ఆర్.ఎం.పి పథకాలు భూమి రికార్డులను కంప్యూటరీకరించాలని అంటున్నాయి. అయితే భూమి రికార్డులు కాగితాల్లో ఉండొద్దు, కంప్యూటర్ లోనే ఉండాలని ధరణి నిర్దేశిస్తుంది. భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి. భూమిపై హక్కులు వచ్చిన వెంటనే రికార్డులు మారాలి. అంతిమంగా భూ రికార్డులకు ప్రభుత్వమే హామీ ఇచ్చే వ్యవస్థ తేవాలి అనేది ఈ పథకాల లక్ష్యాలు. ఇందులో భాగంగా వచ్చినవే ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన.. వెబ్ ల్యాండ్, తెలంగాణ ఏర్పడిన వచ్చిన.. మా భూమి ఇప్పుడున్న.. ధరణి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News