Star Hero : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమలు డేటింగ్ అలాగే పెళ్లిళ్లు అనేవి కామన్ గా జరుగుతాయి. తమ సినిమాలో హీరోనో లేదా హీరోయిన్ ప్రేమించి కొద్ది రోజులు డేటింగ్ లో ఉండి , ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు సెలబ్రిటీలు . ఇటీవల ఎంతో మంది సెలబ్రిటీల జంటలు తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాయి. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు కొంతమంది జీవితాంతం కలిసి ఉండడానికి ఇష్టపడ్డారు. మరి కొంతమంది మధ్యలోనే మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. ఈమధ్య ఇండస్ట్రీలో విడాకులు తంతు కూడా ఎక్కువగా వినిపిస్తుంది . అయితే తాజాగా మరో స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ స్టార్ హీరోకి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి ఇప్పుడు మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం మీడియాలో ఈ వార్త సంచలనంగా మారింది ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అతను ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలాంటివి బాలీవుడ్ లో మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా ఎంతో సుదీర్ఘకాలం రిలేషన్ తర్వాత డివోర్స్ తీసుకున్న సెలబ్రెటీస్ కూడా చాలా మంది ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవడం లేదా అసలే దాంపత్య జీవితానికి దూరంగా ఉండటము బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నారు అయితే ఇప్పుడు స్టార్ హీరోని గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చేరినట్లు సమాచారం. ఈయన ౨౦౧౨ లో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సైఫ్ ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరిగాయో ఎటువంటి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని వార్త మాత్రం బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు తన చేతి మీద కరినా అనే పేరును పచ్చబొట్టు కొట్టించుకున్న విషయం తెలిసింది ఇప్పుడు దాని ప్లేస్ లో ఒక త్రిశూలం వేయించుకున్నారు. ఈ త్రిసూలం ఫోటో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు మీడియా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి . మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో దుమారం లేపుతుంది.
పచ్చబొట్టు తీసేసి ఉద్దేశం ఉంటే అసలు ఎందుకు వేయించుకోవడం అంటూ.. కరినను వదిలి మూడో పెళ్లి చేసుకోబోతున్నావా సైఫ్ అంటూ.. నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక సైఫ్ అలీఖాన్‌కు కరీనాతో రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. విడాకుల వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో సారి వినిపించడం తో అటు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మొదట సైఫ్‌కు 1991లో నటి అమృత సింగ్‌తో వివాహం జరిగింది. 13 ఏళ్లు ఆవిడతో కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు రావడంతో సైఫ్ అమృత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత కరీనాకపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిజంగానే వీరిద్దరు విడాకులు తీసుకుపోతున్నారా లేకపోతే ఇంకేదైనా కారణంతో టాటూ ని తొలగించారా అన్నది తెలియాల్సింది ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.