BigTV English

Anupam Kher : ప్రముఖ నటుడి కార్ దొంగతనం… పొట్ట చెక్కలయ్యేలా నవ్విన పోలీసులు

Anupam Kher : ప్రముఖ నటుడి  కార్ దొంగతనం… పొట్ట చెక్కలయ్యేలా నవ్విన పోలీసులు

Anupam Kher : కొన్నిసార్లు సినిమాల్లో జరిగే పరిస్థితులే రియల్ లైఫ్ లోనూ జరుగుతూ ఉంటాయి. నిజానికి రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే కొన్ని రీల్ సీన్స్ రియాల్టీలో జరిగితే వింతగా అనిపిస్తుంది. అది కూడా ఒక యాక్టర్ కి జరిగితే మరెంత విచిత్రంగా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందట. కార్ దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే, వాళ్లేమో ఆయన కంప్లైంట్ విని పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గమనార్హం. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. కానీ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో ఆయన ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.


ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘కార్తికేయ 2’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అయితే ఇలా స్టార్ నటుడిగా ఎదగడం వెనక ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, పడిన అవమానాలు ఉన్నాయి. వాటి గురించి తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు అనుపమ్ ఖేర్. అందులో భాగంగానే ఒకసారి తన కారు చోరీకి గురి కాగా, కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసులు  నవ్వారు అనే చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారాయన.

అనుపమ కేర్ (Anupam Kher) మాట్లాడుతూ తనకు డ్రైవింగ్ చేయడం నచ్చదని, కానీ ఓ రోజు ముంబైలో ఉన్న అమ్మవారి దేవాలయానికి కానీ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అయితే కారును ఆలయ ప్రాంగణం బయట పార్క్ చేసి లోపలికి వెళ్లానని, తీరా అక్కడి నుంచి బయటకు చూస్తే తన కారును ఎవరో తీసుకెళ్లడం కనిపించిందని చెప్పుకొచ్చారాయన. దీంతో వెంటనే టెంపుల్ లో నుంచి బయటకు వచ్చి అక్కడే ఉన్న ఆటో రిక్షాను ఎక్కి ఆ కారును ఫాలో అవ్వమని ఆటో డ్రైవర్ కి చెప్పారట.


అయితే ఆ తర్వాత కార్ మాయం అవ్వడంతో ఆ కారు దొంగను పట్టుకోలేకపోయామని అన్నారు అనుపమ్ (Anupam Kher). ఇక ఇంత జరిగాక పట్టుకోలేకపోవడంతో చేసేదేం లేక సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్లారట. ఈ క్రమంలో అనుపమ్ కార్ ఎలా పోయిందో అక్కడున్న పోలీసులకు వివరిస్తే, వాళ్లు కంప్లైంట్ తీసుకోవడం పక్కన పెట్టి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అది వారికి సినిమాల్లో కనిపించే సన్నివేశంలా అనిపించిందని వెల్లడించారు.

ఇక టెలివిజన్ రంగంలోకి రావాలనే ప్రయత్నంలో తాను 2003లో ఆర్థికంగా నష్టపోయానని, అప్పటికే నటుడిగా పేరు వచ్చినప్పటికీ, సినీ అవకాశాలు వస్తున్నప్పటికీ ఆ నష్టాల వల్ల తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు ఆయన. ఇలాంటి కష్ట సమయంలో నటుడిగా నిలదొక్కుకునే టైమ్ లో మహాలక్ష్మి టెంపుల్ ను సందర్శించుకునే వాడినని అనుపమ్ ఖేర్ (Anupam Kher) పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×