BigTV English

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్ అన్ స్టాపబుల్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

Chandrababu On NBK 50 Years: బాలకృష్ణ కెరీర్ అన్ స్టాపబుల్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

Chandrababu On NBK 50 Years: బాలయ్య అన్ స్టాపబుల్‌గా ముందుకు సాగాలని.. NBK 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై సోషల్ మీడియా వేదికగా CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య.. ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారన్నారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.


స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1974లో విడుదలైన తెలుగు చిత్రం “తాతమ్మ కల”తో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన బాలయ్య గత 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న బాలయ్యను తెలుగు చలనచిత్ర పరిశ్రమ సన్మానం చేయనుంది. సెప్టెంబర్ 1న జరగనున్న ఈ సన్మాన కార్యక్రమంలో సినీరంగానికి చెందిన అతిరథ మాహారథులు పాల్గొంటారని తెలుగు ఫిల్మ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ వెల్లడించింది.

50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ నటుడిగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు బాలయ్య ఒక్కడే కావడం విశేషం. నందమూరి తారకరామారావు ఆరవ సంతానమైన నందమూరి బాలకృష్ణ 14 ఏళ్లకే నట ప్రవేశం చేశారు. 1984లో వచ్చిన “మంగమ్మగారి మనవుడు” మూవీతో తొలి విజయాన్ని అందుకున్న బాలయ్య అక్కడనుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య సినిమాలు బాలయ్య క్రేజ్ ను మరింత పెంచాయి. ముద్దుల మావయ్య సినిమాలో బాలయ్య వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి. 1990లో వచ్చిన నారీ నారీ నడుమ మురారీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఒక్క పైట్ కూడా లేకుండా బాలయ్య నటించిన ఆ సినిమా అప్పట్లో రికార్డులను తిరగరాసింది.


Also Read: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి కల్పిక కామెంట్స్.. అమాకత్వంతో అలా చేశాను, కానీ..

ఆ తర్వాత వచ్చిన లారీ డ్రైవర్ సినిమా మాస్ ఫాలోయింగ్ ను మరింత పెంచింది. విజయశాంతి హీరోయిన్ గా నటించిన బాలయ్య సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. కలెక్షన్ ల వర్షం కురిపించారు. 1991లో వచ్చిన ఆదిత్య 369 సినిమా బాలయ్యకు సూపర్ స్టార్డమ్ ను తీసుకొచ్చింది. రౌడీ ఇన్ప్సెక్టర్, బంగారు బుల్లోడు, బైరవ ద్వీపం బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచాయి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఓ మైలు రాయిగా నలిచిపోయింది.

నరసింహానాయుడు, లక్ష్మీనరసింహ, సింహా సినిమాలు బాలయ్య సినీ కెరియర్ లో మరపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి. 2014లో వచ్చిన లెజెండ్ సినిమా, 2021లో వచ్చిన అఖండ సినిమాలు బాలయ్యలో నటవిశ్వరూపాన్ని చూపించాయి. ఒక పక్క సినీ రంగంలో రాణిస్తూనే సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు బాలయ్య. అక్కడతో ఆగకుండా 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. హిందూపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019, 2024, కూడా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. ప్రజాప్రతినిధిగా తనవంతు సేవ చేస్తున్నారు బాలయ్య.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×