BigTV English

Actor Ali : తహసీల్దార్ కు సినీ నటుడు ఆలీ దరఖాస్తులు..

Actor Ali : తహసీల్దార్ కు సినీ నటుడు ఆలీ దరఖాస్తులు..

Actor Ali : టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటుడు, కమెడీయన్ ఆలీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈయన సినిమాలతో బాగా పాపులారిటిని సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న ఈయన ఏదొక ఇష్యూ తో వార్తల్లో కూడా హైలెట్ అవుతుంటాడు. ఇటీవల కాలంలో ఆలీ వివాదాల్లో చిక్కుకున్నాడు. సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు పలు వ్యాపారాలు, స్థలాలు కొని బాగానే సంపాదించుకున్నాడు. ఇక తెలంగాణలో ఆయన పలు చోట్ల స్థలాలు ఉన్నాయి. ఈ క్రమంలో అలికి ఇటీవల తెలంగాణ పోలీసులు అక్రమ కట్టడాలకు సంబంధించిన నోటీసులను పంపించిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా తనుకు నోటీసులు రావడం గురించి కమెడియన్ ఆలీ స్పందించారు..


ఇకపోతే అలీ ఫార్మ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ నోటీసులపై అలీ స్పందిస్తూ.. ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం నా స్థలాన్ని నేను లీజుకు ఇచ్చాను. అయితే లీజుకి ఇచ్చిన స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. మరి ఈ నిర్మాణాలపై తాను ఎలాంటి సమాధానం చెప్పలేననీ, లీజు తీసుకున్న వారికి సమాధానం చెబుతారని తెలిపారు. కానీ ఆలీ చెప్పిన సమాధానం నచ్చకపోవడంతో 22న గ్రామ కార్యదర్శి శోభారాణి మరో నోటీసు ఇచ్చారు. ఇలా నోటీసులు రావడంతో ఆ నోటీసులను కూడా ఫామ్ హౌస్ లో పనిచేసే వారికే అందజేశామని తెలిపారు..

అయితే, ఈ నోటీసులు ఆయనకు కాదు ఫామ్ హౌజ్ లో పనిచేస్తున్న వారికి నోటీసులు ఇచ్చారని తెలుస్తుంది.. ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపట్టిన నేపథ్యంలోనే పంచాయితీ కార్యదర్శి ఆలీకి నోటీసులను పంపించడమే కాకుండా వెంటనే అనుమతి లేని నిర్మాణాలను ఆపాలని ఆదేశాలను జారీచేశారు. తాజాగా ఈ నోటీసుల పై ఆలీ స్పందించారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం తహసీల్దార్‌ కార్యాలయానికి సోమవారం సినీ నటుడు ఆలీ వచ్చి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు.. సోమవారం ఆయన నవాబుపేట మం డల తహసీల్దారు కార్యా లయానికి వచ్చా రు. నిర్మా ణాలకు అనుమతులు తీసుకోవడానికి వీలుగా వ్యవసాయేతర భూమిగా మార్చు కునే ప్రక్రియపై తహసీల్దారు తులసీరామ్కు దరఖాస్తు చేసుకొని పూర్తి చేశారు.. ఎక్‌మామిడి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్లు 340, 341, 344, 345లో 5.22 ఎకరాల భూమి విస్తీర్ణానికి సంబంధించి భూమి కోసం తహసీల్దార్‌ జయరాం నుంచి అనుమతులు పొందారు.  సినిమాల విషయానికొస్తే.. ఇక సినీ నటుడు ఆలీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు. ఇప్పుడు ప్రత్యేక పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. అందుకే సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నారని ఇండస్ట్రీలో టాక్.. అటు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నాడు.


Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×