BigTV English

Apsara Rani: ఇండస్ట్రీకి దూరం అవుదామనుకున్నా.. కట్ చేస్తే..!

Apsara Rani: ఇండస్ట్రీకి దూరం అవుదామనుకున్నా.. కట్ చేస్తే..!

Apsara Rani:అప్సరా రాణి (Apsara Rani)..ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు ఉండరు.. ఈ ముద్దుగుమ్మ ఆర్జీవి బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో వచ్చిన ‘థ్రిల్లర్’ మూవీ ద్వారా టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.ఈ మధ్యకాలంలో ఆర్జీవి ఎలాంటి సినిమాలు తీస్తున్నారో చెప్పనక్కర్లేదు. అలాంటి సినిమాల్లో హీరోయిన్గా అంటే కచ్చితంగా అన్నింటికి ఒప్పుకునే ఉండాలి. అలా అప్సర రాణి థ్రిల్లర్ సినిమాలో తన అందాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్సరా రాణి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆమెకు సంబంధించిన ఎన్నో ఫొటోస్ దర్శనమిస్తాయి. అలా యూత్ కి పిచ్చెక్కించే అందాలతో అప్సరా రాణి ఎప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఉండేది. అలా ఆర్జీవి బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె.. తెలుగు ఇండస్ట్రీలోకి 4 లెటర్స్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ థ్రిల్లర్ ద్వారా ఫేమస్ అయింది. కేవలం నటిగానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


స్పెషల్ సాంగ్స్ లో చేసి మెప్పించిన ఆర్జీవి బ్యూటీ..

ముఖ్యంగా రవితేజ(Raviteja) హీరోగా చేసిన ‘క్రాక్’ మూవీలో “భూమ్ బద్దలు భూమ్ బద్దలు నా ముద్దుల సౌండే” అనే సాంగ్ లో చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత ‘సీటీమార్’, ‘డి కంపెనీ’ వంటి సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. అయితే మొదట సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే ఫేమస్ అవుతారో వారికి అలాంటి పాత్రలే వస్తాయి. అలా ఈమెకు కూడా పూర్తిగా అలాంటి పాత్రలే వచ్చాయట.అలా అప్సరా రాణి మా ఇష్టం(Ma Ishtam) సినిమాలో మొదటిసారి ‘లెస్బియన్’ పాత్రలో నటించింది. ఈ సినిమా భారతదేశంలోనే మొదటి లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా తర్వాత ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగిపోయారు. కానీ అలాంటి సమయంలో ఉన్నట్టుండి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాలి అనుకుందట. మరి అలా అప్సర రాణి అనుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్సరా రాణి నటించిన తాజా చిత్రం రాచరికం (Racharikam)..ఒకప్పటి లవర్ బాయ్ వరుణ్ సందేశ్ (Varun sandesh), విజయ్ శంకర్(Vijay Shankar), అప్సరా రాణి కలిసి నటించిన మూవీ రాచరికం..


ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకున్న అప్సరా రాణి..

ఈ సినిమాలో తాను ఒక మంచి పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేసింది. అయితే తాజాగా రాచరికం మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు చిత్ర యూనిట్. ఇందులో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..” నాకు అన్నీ ఒకే విధమైన పాత్రలు రావడంతో చిరాకేసి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ ఆ దేవుడే నా దగ్గరికి ఈ రాచరికం మూవీ టీంని పంపించారు అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్రలో చేశాను.ఈ పాత్ర మీకు కచ్చితంగా నచ్చుతుంది” అంటూ అప్సరా రాణి చెప్పుకొచ్చింది.ఇక రాచరికం మూవీలో వరుణ్ సందేశ్(Varun Sandesh) నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ఈశ్వర్ నిర్మించిన ఈ సినిమాకి సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని రాయలసీమ అంటే ఏంటో రాచరికం మూవీలో చూడవచ్చు అంటూ విజయ్ శంకర్ మాట్లాడారు.ఇక ఈ సినిమా ఈనెల 31న విడుదల కాబోతోంది. మరి చూడాలి ఈ సినిమాలో అప్సరా రాణి పోషించిన పాత్ర ఆమె కెరీర్ కి ఎంత ప్లస్ అవుతుందో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×