RC 16: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఆర్సీ 16 (RC 16 ) ఆటకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో మెగా బ్లాస్టింగ్ జరగబోతోంది. గ్లోబల్ స్టార్ ఆడబోయే ఆటను చూడ్డానికి రెడీ అయ్యారు మెగాభిమానులు. ఇప్పటికే సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. గేమ్ ఛేంజర్ (Game Changer) తర్వాత ఆర్సీ 16తో మెగా లెక్కలన్నీ సరిచేయడానికి రామ్ చరణ్ వస్తున్నాడంటూ.. ఓ రేంజ్‌లో హైప్ ఎక్కించుకుంటున్నారు మెగా ఫ్యాన్. ఇప్పటి వరకు వచ్చిన లీకుల ప్రకారం.. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఊహించని విధంగా ఆర్సీ 16ని ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా చాలా ఆటలు ఈ సినిమాలో ఉంటాయని అంటున్నారు. ఇందులో చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడనే టాక్ ఉంది. దీంతో.. ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. అయితే.. ఇలాంటి వాటిపై ఓ క్లారిటీ రావాలంటే.. ఆర్సీ 16 ఫస్ట్ లుక్ బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడా సమయం దగ్గరపడింది. ఇంకొన్ని గంటల్లో మెగా తుఫాన్ రాబోతోంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఆర్సీ 16 టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
RC 16 టైటిల్ ఫిక్స్, గ్లింప్స్ రెడీ.. కానీ?
మార్చ్ 27 న రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే ఉంది. మార్చి నెల ఆరంభంలోనే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు మెగాభిమానులు. మేకర్స్ కూడా చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా.. RC16 నుంచి అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. RC 16 ఫస్ట్ లుక్ టైటిల్‌తో పాటు ఒక స్పెషల్ గ్లింప్స్ రెడీ చేస్తున్నారని, అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో సపరేట్‌గా ఓ ఫోటో షూట్ కూడా నిర్వహిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ తీరా సమయం దగ్గరపడేసరికి.. RC 16 నుంచి గ్లింప్స్ రాకపోవచ్చని మాట వినిపించింది. ఇదే నిజమైతే.. మెగా ఫ్యాన్స్‌కు డిసప్పాయింట్ తప్పదని అనుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ ఫస్ట్ లుక్ రావడం పక్కా అని తెలుస్తోంది. కుదిరితే గ్లింప్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ సినిమాకు ముందు నుంచి పెద్ది (Peddi), పవర్ క్రికెట్ (Power Cricket) అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇందులో పెద్ది టైటిల్ ఆల్మోస్ట్ లాక్ చేసినట్టుగా సమాచారం. ఆల్రేడీ మేకర్స్ గ్లింప్స్ కట్ చేశారట. దీనికి రెహమాన్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఒకటి పెండింగ్ అన్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా రెహమాన్ సరైన సమయానికి స్కోర్ ఇవ్వలేకపోయినట్టుగా సమాచారం. లేదంటే ఈపాటి ఆర్సీ 16 అప్డేట్ వచ్చి ఉండేదని టాక్. కానీ ప్రస్తుతం టైటిల్ గ్లింప్స్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఏ సమయంలో అయినా ఆర్సీ 16 అప్డేట్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
మెగా ఆశలన్నీ RC 16 పైనే..
గత సంక్రాంతికి భారీ అంచనాల మధ్యన వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. శంకర్ పై భారీ ఆశలను పెట్టుకున్నారు. కానీ శంకర్ పై చరణ్ పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో.. ప్రస్తుతానికి మెగాభిమానుల ఆశలన్నీ ఆర్సీ 16 పైనే ఉన్నాయి. బుచ్చిబాబు కూడా ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే జెట్ స్పీడ్‌లో షూటింగ్ చేస్తున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోను ఇదే ఏడాదిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామీణా నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టైల్‌లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర అతని మునుపటి చిత్రం ‘రంగస్థలం’లో చిట్టిబాబు కంటే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని.. గతంలో రామ్ చరణ్ స్వయంగా చెప్పారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ (jahnvi kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఆర్సీ 16 ఎలా ఉంటుందో చూడాలి.