BigTV English
Advertisement

Venky Kudumula : కేతిక నా ఆప్షన్ కాదు… మైత్రి వాళ్ల వల్లే… సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్

Venky Kudumula : కేతిక నా ఆప్షన్ కాదు… మైత్రి వాళ్ల వల్లే… సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్

Venky Kudumula : ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలోని ‘అదిదా సర్ప్రైసు’ (Adhi Dha Surprisu) అనే పాటకు హీరోయిన్ కేతికా శర్మ వేసిన స్టెప్పులు వైరల్ ఆయన సంగతి తెలిసిందే. ముందుగా ఈ స్టెప్స్ వివాదాస్పదం కాగా, ఆ తర్వాత ఈ సాంగ్ లోని ఇదే స్టెప్పు ట్రెండ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ ను బయట పెట్టారు డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula). అసలు ఈ సినిమాలో కేతికా శర్మనే ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.


కేతికా శర్మనే ఎందుకు ?

‘రాబిన్ హుడ్’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మూవీ ప్రమోషన్స్ లో జోష్ పెంచారు మేకర్స్. ఇప్పటికే వినూత్న రీతిలో ఈ మూవీకి ప్రమోషన్స్ చేస్తూ వస్తున్న డైరెక్టర్ వెంకీ కుడుముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అందులోనూ ‘అదిదా సర్ప్రైసు’ పాటలో కేతిక శర్మని ఎందుకు తీసుకున్నారు అనే విషయాన్ని వివరించారు.


“మైత్రి మూవీ మేకర్స్ తలుచుకుంటే డేవిడ్ వార్నర్ ని సినిమాలోకి దింపినట్టే, స్టార్ హీరోయిన్ ను తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేయించగలరు. అలాంటిది కేతికా శర్మనే ఎందుకు తీసుకున్నారు? అనే ప్రశ్న డైరెక్టర్ కు ఎదురయింది. దానికి దర్శకుడు వెంకీ కుడుములు స్పందిస్తూ “మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు పుష్ప సినిమా టైంలో కూడా కేతికా శర్మతో స్పెషల్ సాంగ్ చేయించాలనుకున్నారు. అందులోనూ ఊ అంటావా సాంగ్ కోసం ఆమెను అనుకున్నారు. ఇక బిగ్ స్టార్స్ అనే విషయాన్ని పక్కన పెడితే నాకు ఆ అమ్మాయి డాన్స్ చూడమని చెప్పారు రవి, నవీన్ గారు. ఓకే అని చెప్పి ఆమె డాన్స్ చేసిన కొన్ని వీడియోలు చూశాను. ఎందుకంటే ఆమె ఇంతకుముందు చేసిన సినిమాల్లో పెద్దగా డాన్స్ ఏమీ కనబడలేదు నాకు. కానీ ఆ డాన్స్ వీడియోస్ చూస్తే వెరీ వెరీ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. ఆమె డాన్స్ మూమెంట్స్ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మా సాంగ్ కి కచ్చితంగా చాలా బాగుంటుంది అని నేను చెప్పడంతో, అప్పుడు ఆమెను మాట్లాడి కన్విన్స్ చేశారు” అని వివరించారు.

నిర్మాతలదీ అదే మాట 

అయితే ‘పుష్ప 2’ సినిమాలో ‘ఊ అంటావా’ సాంగ్ కోసం సమంత కంటే ముందు కేతికా శర్మని అనుకున్నారు ఈ విషయాన్ని ఇంతకు ముందు ఇదే మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత రవిశంకర్ కూడా వెల్లడించారు. అప్పుడు వేరే కారణాల వల్ల కేతిక మిస్ అవ్వడంతో సమంతను తీసుకున్నామని, కానీ ఇప్పుడు ‘రాబిన్ హుడ్’లో ఆమెతో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వచ్చిందని రవి శంకర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ వెంకీ కుడుముల మైత్రి మూవీ మేకర్స్ వారు చెప్పాకే, ఆమె గత డాన్స్ వీడియోలు చూసి అందులో ఆమె ఎక్స్ప్రెషన్స్, డాన్స్ నచ్చడంతోనే ఈ ఛాన్స్ ఇచ్చామని వెల్లడించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×