Raviteja : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ ఖాతాలో ఈమధ్య సరైన హిట్ సినిమా పడలేదు. రవితేజ, శ్రీ లీల జంటగా నటించిన ధమాకా సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని మాత్రమే సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ఈ హీరో ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతున్నాయి. మరి ప్రస్తుతం చేస్తున్న సినిమా అయినా రవితేజకు హిట్ ట్రాక్ ను అందిస్తాయేమో చూడాలి.. సినిమాల సంగతి పక్కన పెడితే రవితేజ ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
రవితేజ పర్సనల్ లైఫ్ చూస్తే..
మాస్ హీరో రవితేజ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో చిన్న చిన్న క్యారక్టర్లు చేస్తూ వచ్చాడు. అయితే ఇండస్ట్రీలో అందరు హీరోల యాక్టింగ్ ఒక తీరు ఉంటే రవితేజ యాక్టింగ్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుందని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్ గాని, ఎమోషనల్ సీన్స్ కానీ,కామెడీ సీన్స్ గానీ ఏ పాత్ర అయినా సరే రవితేజ అలవోకగా చేసేస్తారు. అలాంటి పాత్రలలో కనిపించి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఒక్క సినిమాలో ఒక్కో పాత్రలో నటించి తన టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే హీరోగా పేరు తెచ్చుకున్నాడు. బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసిన రవితేజ బాగానే డబ్బును సంపాదించాడు. అయితే కోట్లు కూడబెట్టిన రవితేజ పేరు మీద చిల్లిగవ్వ కూడా లేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరి పేరు మీద ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.
ఆస్తులు మొత్తం ఆమె పేరు మీదే ఉన్నాయా..?
హీరో రవితేజా ఎన్ని కోట్ల ఆస్తులను కూడా బెట్టాడో అందరికి తెలుసు.. ఈయన నిజానికి ఒక్కో మూవీకి 12 కోట్లు తీసుకుంటున్నాడు. క్రాక్ సినిమా తర్వాత 15 కోట్లు, ఇక ధమాకా మూవీ తర్వాత ఏకంగా 20 కోట్లు తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రవితేజ దాదాపుగా 150 కోట్ల నికర ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 కోట్ల విలువచేసే ఇడ్లు, 6 కోట్ల విలువైన కార్లు ఇతర వస్తువులు, 50 కోట్ల విలువైన ఫ్లాట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ ఆస్తి దాదాపు ఆయన భార్య కళ్యాణి పేరు మీదే ఉందని తెలుస్తుంది. మరి భార్య పేరు మీద ఎందుకు పెట్టారో తెలియలేదు. కానీ ఆస్తులు భార్య పేరు మీద పెట్టడంతో ఆయన పై ప్రశంసలు కురుస్తున్నాయి.. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రీలీలతో జతకట్టి ఓ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఆ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ హిట్ అయితే రవితేజా హిట్ ట్రాక్ మళ్లీ టర్న్ అవుతుంది. లేదంటే సినిమాల నుంచి తప్పుకుంటాడేమో చూడాలి..