OTT Movie : ఇప్పుడు కొన్ని దేశాలలో అబ్బాయిలను ,అబ్బాయిలు.. అమ్మాయిలను అమ్మాయిలు చట్టబద్ధంగా పెళ్లి కూడా చేసుకోవచ్చు. మన దగ్గర అయితే ఇలాంటి వాళ్ళను చిన్న చూపు చూస్తుంటారు. ఇప్పుడు చాలా దేశాలు దీనికి చట్టబద్ధత తీసుకొచ్చాయి. జన్యులోపం కారణంగా వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. ఈ విషయం తెలిసి కూడా, ఇటువంటి వారిని అవమానిస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఇద్దరమ్మాయిలు సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
1885లో ఎలిసా, మార్సెలా అనే ఇద్దరు యువతులు స్పెయిన్‌లో ఒక కాలేజీలో టీచర్ ట్రైనింగ్ లో కలుస్తారు. వారి స్నేహం త్వరలోనే, ప్రేమ సంబంధంగా మారుతుంది. అయితే ఆ కాలంలో అలాంటి సంబంధాలు చట్టబద్ధంగా, సామాజికంగా నిషేధించబడ్డాయి. మార్సెలా తల్లిదండ్రులు వారి సంబంధాన్ని గమనించి, ఆమెను మాడ్రిడ్‌లోని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తారు. అయినప్పటికీ చదువు పూర్తయిన తర్వాత, వారిద్దరూ ఒక గ్రామీణ ప్రాంతంలో టీచర్లుగా పని చేస్తూ మళ్లీ కలుస్తారు. ఇప్పుడు ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంటారు.
సమాజం నుండి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఎలిసా చనిపోయిన తన కజిన్ మారియో రూపానికి మారుతుంది. ఆమె ఇప్పుడు పురుషుడి రూపంలో ఉంటుంది. ఈ సమయంలో మార్సెలా స్థానిక కలప శ్రామికుడు ఆండ్రెస్‌తో సన్నిహితంగా కలిసి రహస్యంగా గర్భవతి అవుతుంది. దీనిని ఎలిసా, మార్సెలా వివాహాన్ని చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి ఒక వ్యూహంగా వాడుతారు.
1901 జూన్ 8న మారియో, మార్సెలా స్థానిక చర్చ్ లో వివాహం చేసుకుంటారు. అయితే ఈ రహస్యం ఎక్కువ రోజులు నిలబడదు. వీళ్లిద్దరి సీక్రెట్ బయటపడుతుంది. గ్రామస్తులు ఆగ్రహంతో వారి ఇంటిపై దాడి చేస్తారు. ఎలిసా, మార్సెలా వారి నుంచి తప్పించుకుని పోర్చుగల్ కు పారిపోతారు. అక్కడ వాళ్ళు అరెస్ట్ అవుతారు. మార్సెలా ఒక బాలికకు జన్మనిస్తుంది. స్పానిష్ అధికారులు వారిని తిరిగి స్పెయిన్‌కు రప్పిస్తారు. ఆ తరువాత ఏం జరిగింది? అనే విషయాన్ని ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : భర్తను చంపి ఆ పనిలో మునిగిపోయే జంట… ఈ సినిమాను ఒంటరిగానే చూడండయ్యా
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ స్పానిష్ డ్రామా పేరు’ఎలిసా & మార్సెలా’ (Elisa & Marcela). 2019 లో వచ్చిన ఈ మూవీకి ఇసాబెల్ కొయిక్సెట్ దర్శకత్వం వహించారు. ఇందులో నటాలియా, మోలినా, గ్రెటా ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1901లో స్పెయిన్‌లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.