BigTV English

Arjun Kapoor: తల్లిదండ్రుల విడాకులు మానసిక క్షోభ కలిగించాయి..ఒక్కో మెట్టు ఎక్కుతూ..!

Arjun Kapoor: తల్లిదండ్రుల విడాకులు మానసిక క్షోభ కలిగించాయి..ఒక్కో మెట్టు ఎక్కుతూ..!

ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోణీకపూర్(Boney Kapoor)తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. విభిన్న చిత్రాలలో నటించినప్పటికీ కెరియర్ పరంగా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇకపోతే తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న అర్జున్ కపూర్.. తన తల్లిదండ్రుల విడాకుల గురించి, తన తల్లి మరణం గురించి, తన తండ్రితో తాను మాట్లాడకపోవడం గురించి అన్నీ చాలా క్లియర్ గా తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే ఆయన తన తల్లిదండ్రులు విడిపోయినప్పుడు ఎంత మానసిక క్షోభ అనుభవించారో అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


మానసిక క్షోభ అనుభవించాను..

అర్జున్ కపూర్ మాట్లాడుతూ… “నాకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న విడాకులు తీసుకున్నారు. అది నన్ను ఎంతో మానసిక క్షోభకు గురిచేసింది. ఇకపోతే నాన్న.. అమ్మ నుండి విడిపోయేటప్పుడు నాన్న చేతిలో ప్రేమ్, రూప్ కీ రాణీ చోరోన్ కా రాజా వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఆయన పని హడావిడిలో పడిపోయారు. అందువల్ల మా మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడలేదు. దీనికి తోడు అదే సమయంలో విడాకులు తీసుకోవడంతో అటు నాన్నకు ఇటు నాకు మధ్య మాటలు కూడా బాగా తగ్గిపోయాయి. ఒకరకంగా చెప్పాలి అంటే.. మాది సమాజంలో పేరు ఉన్న కుటుంబం. విడాకుల తర్వాత మా ఇంట్లో విషయాలు తెలుసుకోవడానికి మీడియా తెగ ఆసక్తి చూపించింది. నా స్కూల్లో తోటి విద్యార్థులు కూడా మా కుటుంబం గురించి గుసగుసలాడడంతో నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. దానివల్ల చదువు పైన కూడా పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోయాను.


తల్లిదండ్రుల దూరం.. స్కూల్లో పెరిగిన భారం..

ఫలితంగా నా చదువు కూడా అటకెక్కింది. అదే సమయంలో ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన నాలో కలిగింది. ఇక వయసు వచ్చాక ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టాను. మొదటి సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో అమ్మ కూడా కన్నుమూసింది. ఇక నా బాధ వర్ణనాతీతం. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాను. తగిలిన ప్రతి దెబ్బ నుంచి కూడా ఎన్నో పాఠాలు కూడా నేర్చుకొని నన్ను నేను మరింతగా మార్చుకున్నాను. ప్రస్తుతం ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్న నేను, ఆ తర్వాత కాలంలో నాన్నతో కూడా మంచి రిలేషన్ ఏర్పరుచుకున్నాను. ప్రస్తుతం నాన్న నేను ఇద్దరం కూడా కలిసి చాలా చక్కగా మాట్లాడుకుంటాం.. ఏదైనా విషయం ఉంటే కూర్చొని ఇద్దరం చర్చించుకుంటాం. ఇక నాన్న చేసిన పనికి ఆయన సంతోషంగా ఉన్నంతకాలం నేను ఏ విధంగా కూడా ఆ విషయాన్ని తప్పుగా అనుకోను” అంటూ అర్జున్ కపూర్ తనలో ఉన్న బాధను ఒక్కసారిగా బయటపెట్టారు.

మొదటి భార్యతో వివాహం.. విడాకులు..

ఇకపోతే 1983లో మోనాను బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకి అర్జున్ కపూర్ , అన్షులా కపూర్ సంతానం. సవ్యంగా సాగుతున్న సంసారంలో ఏం జరిగిందో తెలియదు కానీ 1996లో విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక అదే ఏడాది ప్రముఖ నటి శ్రీదేవి(Sridevi) ను వివాహం చేసుకున్న ఈయన, ఆ విషయంలో మరింత హాట్ టాపిక్ గా మారారు. వీరి బంధానికి గుర్తుగా జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించారు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×