మూవీ : విడుదల పార్ట్ 2
రిలీజ్ డేట్ : 20 డిసెంబర్ 2024
డైరెక్టర్ : వెట్రిమారన్
నటీనటులు : సూరి, విజయ్ సేతుపతి, మంజు వారియర్, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో పాటు తదితరులు
నిర్మాత : ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్
నిర్మాణ సంస్థ : RS ఇన్ఫోటైన్‌మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ
Viduthalai Part 2 Movie Rating : 1.75/5
Viduthalai Part 2 Movie Review and Rating : గతేడాది వచ్చిన విడుదల పార్ట్ 1 తెలుగు, తమిళ భాషల్లో పాజిటివ్ టాక్ సంపాదించింది. తమిళంలో బాగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో ఆడలేదు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదల 2 అయినా గట్టిగా కలెక్ట్ చేసేలా ఉండేమో ఈ రివ్యూ ద్వారా తెలుసు కుందాము రండి…
కథ:
ఫస్ట్ పార్ట్ లో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ బాంబులు వంటివి వేసి నిరసన తెలుపుతున్న ప్రజాదళం నాయకుల కుటుంబాలను, ముఖ్యంగా ఆడవాళ్లను పోలీసులు చిత్ర హింసలు చేయడం.. అందులో భాగంగా వాళ్ళని బట్టలు తీసేసి ఇంటరాగేట్ చేయడం, ఫైనల్ గా తమిళరసి(భవానీ శ్రీ) అనే ఓ అమ్మాయి కోసం కుమరేశన్(సూరి)… పెరుమాళ్‌ని (విజయ్ సేతుపతి) పోలీసులకి పట్టించడం జరుగుతుంది.ఆ తర్వాత ఏమైంది అనేది సెకండ్ పార్ట్ కథ. ఇక ఈ సెకండ్ పార్ట్ లో కస్టడీలో పెరుమాళ్‌ని పోలీసులు విచారించడం.. తర్వాత అతను తన గతాన్ని చెప్పడం జరుగుతుంది. అతను స్కూల్లో పని చేసే మాస్టర్. అతని అసలు పేరు కరుప్పన్. అతని జీవితంలోకి కేకే (కిషోర్), మహాలక్ష్మి (మంజు వారియర్) ఎంట్రీ ఇవ్వడం. వాళ్ళ కోసం ఫైనల్ గా ఇతను పెరుమాళ్ గా మారడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏమైంది? మహాలక్ష్మిని అతను పెళ్లి చేసుకున్నాక ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. అనేది తెరపై చూడాల్సిన కథ.
విశ్లేషణ:
వెట్రిమారన్ సినిమాలు చాలా రస్టిక్ ఉంటాయి . అలాగే వయోలెన్స్ కూడా ఎక్కువ. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే వయోలెన్స్ కోసం తీసే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. మన కళ్ల ముందే అవి జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. విడుదల మొదటి భాగంలో ట్రైన్ యాక్సిడెంట్ సీన్ ను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది అమ్మాయిలు ఒంటి మీద నూలి పోగు లేకుండా నటించారు. కానీ అవి అసభ్యంగా మనకి అనిపించవు. ఎమోషనల్ గా ఫీల్ అవుతాము. అలాంటి సన్నివేశాలు అని కాదు కానీ అలాంటి ఎమోషన్ విడుదల 2 లో కొరవడింది. పెరుమాళ్ ని విచారించే సీన్, ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ వంటివి మంచి సార్టింగ్ పాయింట్స్. కానీ ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ పార్ట్ తీయడానికి ఇందులో సరైన కోర్ పాయింట్ ఏముందబ్బా అనిపిస్తుంది. మొదటి భాగంలో మిగిల్చిన ప్రశ్నలని సెకండ్ పార్ట్ లో సరిగ్గా కంక్లూడ్ చేయలేదు. అందుకే ప్రేక్షకులు డిస్ కనెక్ట్ ఆగిపోతారు. అయితే టెక్నికల్ టీం పనితీరుని తక్కువ చేయలేము. ఇళయరాజ సంగీతంలో పాటలు కొంచెం పాతగా అనిపించినా నేపధ్య సంగీతం బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటర్ నిడివి విషయంలో బాగానే జాగ్రత్త తీసుకున్నాడు.
మొదటి పార్ట్ కి సూరినే మెయిన్ రోల్. కానీ రెండో భాగానికి విజయ్ సేతుపతి హీరో ఆదుకోవాలి. ఇద్దరూ బాగా నటించారు. కానీ సూరి కే ఎక్కువ మార్కులు పడుతాయి. మంజు వారియర్ రోల్ జస్ట్ ఓకే. గౌతమ్ మీనన్ సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో లాగించేశాడు. మిగిలిన నటీనటులు ఓకే.
ప్లస్ పాయింట్స్ :
మొదటి అరగంట
విజయ్ సేతుపతి
టెక్నికల్ టీం పనితీరు
మైనస్ పాయింట్స్ :
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
సాగదీత
క్లైమాక్స్
మొత్తంగా విడుదల 2 .. మొదటి భాగం రేంజ్లో అలరించలేదు. స్క్రీన్ ప్లే వీక్ గా ఉండటమే ఇందుకు కారణమని చెప్పాలి. టార్గెటెడ్ ఆడియన్స్ ని కూడా బోర్ కొట్టించే సినిమా ఇది.
Viduthalai Part 2 Movie Rating : 1.75/5