Aishwarya Rajesh :ప్రముఖ తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) ఈమధ్య జోరు పెంచిందని చెప్పవచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి.. జనవరి 14వ తేదీన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి ప్రాంతీయ సినిమాగా రికార్డు బ్రేక్ చేసింది. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ కి వరుసగా సినిమాలలో అవకాశాలు తలుపు తడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా హోమ్లీ పాత్రలతోనే ప్రేక్షకులను అలరించాలని ఐశ్వర్య అనుకుంటున్నట్లు సమాచారం.
షాపింగ్ మాల్స్ తో భారీ ఆదాయం..
ఇకపోతే మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసే వరకు ఖాళీగా సమయాన్ని వృధా చేయకుండా ఆదాయ వనరులను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ.. ఈ ముద్దుగుమ్మ భారీగానే సంపాదిస్తోంది. నెలకు రెండు నుండి మూడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే సంపాదిస్తోంది ఐశ్వర్య రాజేష్. అంతేకాదు ఈ షాపింగ్ మాల్స్ కి ఓపెనింగ్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా భారీగానే ముట్ట చెబుతున్నారట. అలా నెలకు ఒకటిన్నర నుండి 2 కోట్ల రూపాయల వరకు ఈ ముద్దుగుమ్మ సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అనంతపురం జిల్లాలో జోసాలూకాస్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి కూడా హాజరయ్యి సందడి చేసింది. ప్రస్తుతం అనంతపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఐశ్వర్య ను చూడడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక దీన్ని బట్టి చూస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఈ అమ్మడు ఇలా క్యాష్ చేసుకుంటోంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఐశ్వర్య రాజేష్ కెరియర్..
రాజేంద్రప్రసాద్, ఈశ్వరీ రావ్ కాంబినేషన్లో వచ్చిన ‘రాంబంటు’ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య.. ఆ తర్వాత తమిళ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగమ్మాయి కావడంతో తెలుగులో అవకాశాలు లభించలేదు. అలా తమిళ్లోనే నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్గా అవతరించింది. ఆ తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు లీడ్రోల్ లో పరిచయమైన ఈమె.. ఆ తర్వాత టక్ జగదీష్ , వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ను అందుకుంది. అలా మొత్తానికైతే వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఈమె.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నం చేస్తోంది ఐశ్వర్య. త్వరలో పాన్ ఇండియా హీరోయిన్ అని పిలిపించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Phani: ఫ్లాప్ హీరోయిన్ గా కేథరిన్.. జర్నలిస్ట్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్..!