Arundhati..సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఆ చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్ కు తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చి మంచి పాపులారిటీ అందుకుంటూ ఉంటారు. చైల్డ్ ఆర్టిస్టులుగా వీరు చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ఆ పాత్రలతో చిరస్థాయిగా నిలిచిపోతారు అనడంలో సందేహం లేదు. ఇక అలాంటివారు ఇప్పుడు పెద్ద వాళ్ళు అయ్యి కొంతమంది ఇండస్ట్రీలో చలామణి అవుతుంటే, ఇంకొంతమంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అయితే ఇంకొంతమంది సడన్ గా తెర ముందుకు వచ్చి పెళ్లి చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో అరుంధతి (Arundhati) చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్ (Divya Nagesh) కూడా ఒకరు.
నిశ్చితార్థం చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్..
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో అనుష్క శెట్టి (Anushka Shetty) లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ‘అరుంధతి’. ఈ సినిమా అనుష్క శెట్టి కెరియర్ ను ఒక్కసారిగా మార్చేసింది. ముఖ్యంగా ఈ సినిమాతో స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇదే సినిమాలో ‘జేజమ్మ’ చిన్ననాటి పాత్రలో ఒక పాప చాలా అద్భుతంగా నటించింది. తన నటనా ప్రతిభకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు సైతం లభించింది. తన పేరు దివ్య నగేష్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైన ఈమె సడన్గా నిశ్చితార్థం చేసుకొని కనిపించడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కొరియోగ్రాఫర్ తో వివాహానికి సిద్ధమవుతున్న దివ్య నగేష్..
తాజాగా తన సహనటుడు, కొరియోగ్రాఫర్ అయిన అజి కుమార్ (Aji kumar)తో చాలా గ్రాండ్గా ఈమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. దివ్య, అజి కుమార్ నిశ్చితార్థానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా కాబోయే జంటకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరి ప్రేమ విషయానికి వస్తే.. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధం గా మార్చుకోవడానికి సిద్ధమయ్యారు.. దివ్య నగేష్ కష్టకాలంలో ఉన్నప్పుడు అజి ఎంతో అండగా నిలిచారట. అందుకే అతడినే భాగస్వామి చేసుకోవాలనుకున్న ఈమె, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది దివ్య నగేష్.ఇక త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది అని సమాచారం.
దివ్య నగేష్ సినిమా విశేషాలు..
2005లో వచ్చిన ‘అన్నియన్’ అని సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత 2009లో అరుంధతి సినిమాలో చిన్ననాటి జేజమ్మ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత “పాసకార నన్ బరాగల్ ” అనే సినిమాలో 2011లో నటించింది. తర్వాత రెండు మూడు చిత్రాలలో లీడ్ రోల్ పోషించినా కూడా అవి ప్రేక్షకుల వరకు చేయలేదు. దాంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ , సహ నటుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.