BigTV English
Advertisement

Tollywood Heroine : రెండేళ్లుగా కనిపించకుండా పోయిన హీరోయిన్..? ఇప్పుడేం చేస్తుందంటే..?

Tollywood Heroine : రెండేళ్లుగా కనిపించకుండా పోయిన హీరోయిన్..? ఇప్పుడేం చేస్తుందంటే..?

Tollywood Heroine : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోల తో రెండు మూడు సినిమాలు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.. కొందరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లీడ్ చేస్తూ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు.. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు గా సక్సెస్ అవుతున్నారు. కొంత మంది మాత్రం ఎవరికీ కనిపించకుండా పోతున్నారు. అసలు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి హీరోయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు వేదం మూవీతో భారీ విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ దీక్షా సేత్.. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది. ఎక్కడుందో తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ రాణించాలంటే అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఆవగింజ అంత ఉండాలి.. ఇండస్ట్రీలో చాలా మంది లైఫ్ సరిగ్గా లేక దుకాన్ సర్దుకుంటున్నారు. అలాంటి హీరోయిన్‌లలో దీక్షాసేథ్ ఒకరు అని చెప్పాలి. దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ వంటి సినిమా ల్లో నటించింది. నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. కానీ పాపకు లక్ కలిసి రాలేదు. మొదటి సినిమా తోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ వేదం సినిమా తరువాత సెకండ్ హీరోయిన్ గా మిరపకాయ్, రెబల్ చిత్రాల్లో దర్శనమిచ్చింది. ఇక ఈ సినిమాలు అమ్మడి కి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. దాంతో పాప బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది.

అయితే బాలీవుడ్ లో కూడా మొదటి సినిమా నిరాశను కలిగించింది. ఇక ఆ తర్వాత జగ్గు దాదా సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది హిందీలో మరొక సినిమాలో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు దీక్షా కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఈ సినిమాల తరువాత దీక్షాసేథ్ ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ తర్వాత ఎక్కడా అడ్రెస్ కూడా లేకుండా పోయింది. 3 ఏళ్లుగా సోషల్ మీడియాలో కూడా టచ్ లో లేదు. ప్రస్తుతం ఈమె ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీక్షా గురించి చర్చ మొదలైంది. ఈమె ఎక్కడ ఉందో అని ఆరా తీస్తున్నారు. సినిమాలు వదిలేసినా కానీ అభిమానులకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండి ఉంటే ఇక్కడన్న క్రేజ్ ఉండేది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..


ఇక కేరీర్ పీక్స్ లో ఉన్న హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తున్నారు.. ఇక పిల్లలు సెటిల్ అయ్యాక ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.. అలా చాలా మంది హీరోయిన్లు సక్సెస్ అవుతున్నారు. వారిలో సంగీత, ఇంద్రజ, టబు, ఆమని, కాజల్ అగర్వాల్, పూర్ణ తదితరులు ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×