trinayani serial today Episode: బెంబేలెత్తిపోయి భయంతో ఆలోచిస్తూ ఉంటారనుకుంటే ఇంత కూల్‌గా కూర్చున్నారేంటి అని సుమన వచ్చి విక్రాంత్‌ను అడుగుతుంది. ఎందుకు కంగారు పడాలి అని అడగ్గానే మీ అభిమాన నయని వదిన కూతురైన గాయత్రి కి దేవీపురం వైకుంఠం పాలలో విషం కలిపి ఇచ్చింది అది పాప తాగి ఉంటే ఇదివరకు పరిస్తితి ఎలా ఉండేది అంటూ సుమన అడగ్గానే అలా జరగదు కదా..? అయినా గాయత్రి పాప కాదు గాయత్రి పెద్దమ్మ అలాగే అక్కడ ఉన్నది త్రినేత్రి కాదు నయని వదిన కదా అందుకే అడ్డుకుంది అంటాడు విక్రాంత్. దీంతో మొత్తానికి ఆ వైకుంఠం పాలు తాగమని నన్ను అడగలేదు అంటుంది సుమన. అలా అయితే నయని వదిన హాల్ లోకి రాకుండా నేనే అడ్డుకునే వాణ్ని అంటాడు విక్రాంత్. దీంతో నేను చనిపోవాలని మీరు బలంగా కోరుకుంటున్నారా…? అంటూ తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంద సుమన.
దురందర ఫోన్ చూస్తుంటే.. రత్నాంభ వచ్చి ఏముంటుందమ్మా అందులో ఎప్పుడూ అందులో తల దూర్చేస్తావు. అని అడుగుతుంది. సోషల్ మీడియా బామ్మ అని చెప్తుంది. మాది తెలుగు మీడియం లే అమ్మా మావి అప్పటి చదువులు అంటుంది. దీంతో మీడియం కాదు బామ్మ సోషల్ మీడియా అంటుంది దురంధర. ఇంతలో తిలొత్తమ్మ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. నేను సోషల్ మీడియా అంటే బామ్మ మీడియం అంటుంది నువ్వైనా చెప్పు వదిన అంటుంది దురందర. ఏం పని లేని వాళ్లు ఆందులో ఏదేదో చూస్తూ పని చేసుకోవడం అని తిలొత్తమ్మ చెప్తుంది.
ఇంతలో సుమన, విక్రాంత్ వస్తారు. ఇక్కడ ఏదో చర్చ జరుగుతుంది అంటుంది సుమన. ఇంతలో తిలొత్తమ్మ బామ్మ నీ మనవరాలు ఇల్లు వదిలి వెళ్లడం నువ్వు చూశావా..? అని అడుగుతుంది. విశాల్ బాబుతో జీవితం పంచుకోలేనప్పుడు ఇక నాకెందుకు ఈ జీవితం అంటూ వెళ్లిపోయింది అని రత్నాంభ చెప్తుంది. సరే ఇంకో ప్రశ్న విశాల్ కు పెళ్లి అయి తన భార్య నయని ఇక్కడే ఉన్నప్పుడు తన కాపురంలో నిప్పులు పోసే పని నీ మనవరాలు ఎందుకు చేస్తుంది అని తిలొత్తమ్మ అడగ్గానే.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అమ్మ ఏవేవో ప్రశ్నలు వేసి నిజం రాబడుతుందేమో అని మనసులో అనుకుంటాడు. ఇంతలో రత్నాంభ తనకు నిద్ర వస్తుందని వెళ్లిపోతుంది.
తర్వాత రత్నాభ తన మనవరాలు త్రినేత్రి ఉదయం ఐదు గంటలకే లేచి అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజలు చేసేది అని దురంధరకు చెప్తుంది. ఒక్కతే అడవిలోకి ఎలా వెళ్లేదని దురందర అడుగుతుంది. ఇళ్లు దాటగానే అమ్మవారికి కబుర్లు చెప్తూ వెళ్లేదట అని రత్నాంభ చెప్పగానే బామ్మకు పొద్దు పోక కథ చెప్తుంది అని హాసిని అంటుంది. ఇది కథ కాదే.. త్రినేత్రి కూడా మన నయనిలా పరమభక్తురాలు. అమ్మవారితో మాట్లాడిందట అని చెప్పగానే ఇంతలో సుమన వచ్చి మన పిల్లని ఎత్తుకోరు కానీ గానవిని మాత్రం ఎత్తుకుని తిరుగుతుంటారు అంటుంది.
ఏది ఏమైనా ఈ పిల్లలను చూస్తుంటే ముచ్చట వేస్తుంది. నా మనవరాలు నేత్రికి కూడా త్వరలోనే పెళ్లి చేస్తాను. దానికి కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం అంటుంది. ఇంతలో మంత్రగాడు ఆత్మలింగం వస్తాడు. సంక్రాంతి చందాకు వచ్చాడేమో చందా ఇచ్చి పంపించు అక్కా అని నయని చెప్తుంది. సరే ఇటు రండి అని హాసిని పిలవగానే ఈ ఆత్మలింగానికే అవమానమా..? అంటూ కోప్పడతాడు. ఇంతలో ఇళ్లంతా బూజు దులపాలని బావగారే ఆన్ లైన్‌లో బుక్ చేశాడేమో అంటుంది సుమన. ఏయ్ ఆపండి ఆత్మలింగాన్ని తక్కువ అంచనా వేయకండి అని వల్లభ చెప్పగానే మరి అతను ఎవరో చెప్పండి బావగారు అని నయని అడుగుతుంది.
నేను చెప్తాను అంటూ తిలొత్తమ్మ మన ఇంట్లో ఆత్మలు దూరాయని ఆయన చెప్పారు. అందుకే పిలిపించాను అంటుంది. ఇంతలో మంత్రజలం చల్లుకుంటూ ఇళ్లంతా తిరుగుతాను ఆత్మలన్నీ బయటకు వెళ్లిపోతాయని చెప్పగానే సరే అంటారు. దీంతో నయని, విక్రాంత్ టెన్షన్ పడుతుంటారు. భూత వైద్యుడికి మీరు దొరికిపోతే ఎలా అంటాడు విక్రాంత్. ఇంతలో రత్నాంభ వచ్చి ఆ ఆత్మలింగాన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అంటుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?